చేనేతల ఆత్మహత్యకు వైసీపీ అసమర్థ విధానాలే కారణం

Feb 7,2024 21:45

ఇంటింటి ప్రచారం చేస్తున్న టిడిపి నాయకులు

                       ధర్మవరం టౌన్‌ : చేనేతల ఆత్మహత్యకు వైసీపీ ప్రభుత్వ అసమర్థ విధానాలే కారణమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతంకాటమయ్య, పట్టణ అధ్యక్షులు పరిశే సుధాకర్‌ విమర్శించారు. బుధవారం పట్టణంలో 38వ వార్డులో టిడిపి పట్టణప్రచార కమిటి ఆధ్వర్యంలో బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ప్రజలకు వివరించారు. నేతన్నలు నేసిన పట్టుచీరలకు సరైన గిట్టుబాటు ధర లభించక పెట్టుబడి కోసం చేసిన అప్పులు సకాలంలో చెల్లించకలేక ప్రభుత్వం ఆదుకోక చేనేతలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భీమనేని ప్రసాద్‌నాయుడు, శీలామూర్తి, రాళ్లపల్లిషరీప్‌, జిలకరశీన, గోసల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

➡️