జాతీయ రహదారులతో జిల్లా అభివృద్ధి : జెసి

అధికారులతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌

       పుట్టపర్తి అర్బన్‌ : జిల్లా అభివృద్ధిలో జాతీయ రహదారుల నిర్మాణం ఎంతో కీలకం అని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ పేర్కొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణాలు, రైల్వేలైన్‌కు సంబంధించి భూ సేకరణపై సంబంధిత అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని జెసి కోర్టు హాలు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ భరత్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో నిర్మాణం అవుతున్న మూడు జాతీయ రహదారుల కోసం అధికారులు 2390 ఎకరాలను ఎలాంటి సమస్య రాకుండా సేకరించడం అభినందనీయం అన్నారు. ఇందుకోసం రైతులు, ప్రజలు బాగా సహకరించారన్నారు. రహదారులు వస్తే పట్టణాలకు రాకపోకులు బాగా పెరుగుతాయన్నారు. జిల్లా అభివద్ధిలో జాతీయ రహదారులు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించి సేకరించిన భూమి లబ్ధిదారులకు నష్టపరిహారం చెల్లింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పుట్టపర్తి డివిజన్‌ పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం మంజూరు నివేదికలు రూపొందించాలని పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖను ఆదేశించారు. ఎన్‌హెచ్‌-42 ముదిగుబ్బ పరిధిలోని సానిపల్లి రోడ్డు నందు భూ సేకరణకు సంబంధించిన ధర్మవరం ఆర్డీవో స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు. ఇందులో ఎలాంటి సమస్యలున్న తన దష్టికి తెస్తే వాటి పరిష్కారానికి కషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, కదిరి ఆర్డీవో వంశీకష్ణారెడ్డి, ధర్మవరం ఆర్డీవో రమేష్‌ రెడ్డి, నేషనల్‌ హైవే ఈఈ మధుసూదనరావు, డిఈలు గిడ్డయ్య, భూసేకరణ విభాగం సూపరింటెండెంట్‌ ఆనంద్‌, భాషా తదితరులు పాల్గొన్నారు.

➡️