జిఎస్‌టిని తొలగించాలి

Dec 20,2023 22:22

 ర్యాలీ నిర్వహిస్తున్న మెడికల్‌ రెప్‌లు

                హిందూపురం : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్‌టిని మందులపై తొలగించాలని ఎపి మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రెఫ్రెంజీవ్‌ యూనియన్‌ అధ్యక్షులు రామమూర్తి డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తు బుధవారం ఎపి మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రెప్రజెంటీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మెడికల్‌ రెప్స్‌ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా రామమూర్తి మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం నకిలీ మందులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అరికట్టాలన్నారు. మందుల ధరలను తగ్గించడంతో పాటు మందులపై విధించిన జిఎస్‌టిని తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ కార్యదర్శి సుబ్రమణ్యం, నాయకులు మునీర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️