జిల్లా అసుపత్రిలో 50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌

జిల్లా అసుపత్రిలో శిలఫలకాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ అరుణ్‌ బాబు తదితరులు

            హిందూపురం : నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా హిందూపురం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రూ.23.25కోట్లతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఆదివారం నాడు గుజరాత్‌ రాష్ట్రంలోని రాజకోట్‌లో జరిగిన సమావేశం నుంచి దేశ వ్యాప్తంగా హెల్త్‌ కేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, శంకుస్థాపనలు చేశారు. ఇందులో మన రాష్ట్రంలో 9 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లను వర్చుల్‌గా శంకుస్థాపనలు చేశారు. హిందూపురం జిల్లా ప్రభుత్వ అసుపత్రిలో నిర్మాణం చేస్తున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ భవన నిర్మాణం పనులకు శంకుస్థాపనులకు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి సందేశాన్ని ప్రేక్షకులు వీక్షించారు. అనంతరం శంకుస్థాపన శిలాఫలకాన్ని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతు సత్యసాయి జిల్లాలోని హిందూపురం జిల్లా ఆసుపత్రిలో పిఎం అభీమ్‌ ఆధ్వర్యంలో 50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ (సిసిబి) నిర్మాణం (2వ కాల్‌)మొత్తం:రూ.23.25 కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు. భవన నిర్మాణం నాణ్యమైన పనులు చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. క్రిటికల్‌ కేర్‌ అందుబాటులోకి వస్తే వెంటిలేటర్‌ పై వైద్యం అందించవచ్చన్నారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ కు గురైన వారు, రోడ్డు ప్రమాదంలో బారిన పడిన వారికి మెరిగిన వైద్యం అందించవచ్చని చెప్పారు. త్వరలో క్రిటికల్‌ కేర్‌ భవన నిర్మాణం పనులు పూర్తిచేసి జిల్లా ప్రజలకు అంకితం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ, పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, హిందూపురం మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి, డిఎం అండ్‌ హెచ్‌ఒ కృష్ణారెడ్డి, డిసిహెచ్‌ఒ జితేంద్ర నాయక్‌, మెడికల్‌ సుపరింటెండెంట్‌ రోహిల్‌ కుమార్‌, ఆర్‌ఎంఒ రుక్మిణమ్మ, స్థానిక బిజెపి నాయకులు ఆదర్శ్‌ కుమార్‌, వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️