దామోదరం సంజీవయ్య జీవితం ఆదర్శనీయం : కలెక్టర్‌

దామోదరం సంజీవయ్యకు నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

           పుట్టపర్తి అర్బన్‌ : కృషి పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చ అనేందుకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవితం నిదర్శనం అని కలెక్టర్‌ అరుణ్‌బాబు తెలిపారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంజీవయ్య జయంతి వేడుకలను బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సాధారణ దళిత కుటుంబంలో జన్మించి, ఉన్నత స్థాయికి సంజీవయ్య ఎదిగారన్నారు. మొట్టమొదట వద్ధాప్య పింఛన్‌ రూపకర్తగా ఆయన ఖ్యాతిగడించారన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్య, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివ రంగ ప్రసాద్‌, బీసీ సంక్షేమ శాఖ అధికారి నిర్మల జ్యోతి, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి మోహన్‌ రావు, పరిశ్రమల శాఖ అధికారి చాంద్‌ బాషా, పట్టు పరిశ్రమల శాఖ జెడి పద్మమ్మ, ఎస్సీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ సభ్యుడు గంగాధర్‌ పాల్గొన్నారు.

➡️