ధర్మవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేనే : పరిటాల శ్రీరామ్‌

Mar 5,2024 21:51

సభలో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌

                    ధర్మవరం టౌన్‌ : ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది తానే అని పరిటాల శ్రీరామ్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మండల పరిధిలోని రావులచెరువు గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు రూపొందించిన సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ, కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం పరిటాల శ్రీరామ్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ధర్మవరంలో టిడిపి జెండా ఎగురు వేసేది కూడా తానే అని అన్నారు. ఎవరో మాట్లాడే గాలి మాటలు అసలు పట్టించుకోవద్దని ఎలాంటి అనుమానాలకు తావు ఇవ్వరాదని అన్నారు. ధర్మవరంలో ఎలాంటి గందరగోళానికి తావు లేదని కచ్చితంగా ఈసారి టిడిపి జెండా ఎగరవేయడం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్‌ చిగిచెర్ల ఓబిరెడ్డి, మాజీ ఎంపీపీ కొనుటూరు వేణుగోపాల్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ పోతుకుంట లక్ష్మన్న, మాజీ జెడ్పీటీసీ మేకల రామాంజనేయులు, చెన్నారెడ్డి, భాస్కర చౌదరి, అశ్వత్థ నాయుడు, భాస్కర్‌ రెడ్డి, సర్పంచి ముత్యాలప్ప నాయుడు, పాలెం వెంకటేశు, బిల్వంపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️