నేడు కదిరికి చంద్రబాబు రాక

చంద్రబాబు రాకకు సంబంధించి కదిరిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న టిడిపి నాయకులు

           కదిరి టౌన్‌ : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు కదిరికి రానున్నారు. ప్రజాగళం యాత్రలో భాగంగా కదిరిలో పర్యటించనున్నారు. సాయంత్రం 6-30 గంటలకు పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొననున్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిములో చంద్రబాబు నాయుడు మాట్లాడనున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటన సంబంధించి ఏర్పాట్లను టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో పూర్తి చేశారు.చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు : కందికుంట టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశామని కదిరి నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ తెలియజేశారు. బుధవారం కదిరిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముస్లిముల ఆచరాలు, సాంప్రదాయాలను టిడిపి ఎప్పుడూ గౌరవిస్తుందని తెలియజేశారు. పవిత్ర రంజాన్‌ మాసంలో చంద్రబాబు నాయుడు మొట్ట మొదటిసారిగా కదిరికి విచ్చేస్తున్నారని తెలిపారు. రంజాన్‌ మాసం పురస్కరించుకుని ముస్లిం సోదరులకు పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో సాయంత్రం 6.30 గంటలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఇఫ్తార్‌ విందులో చంద్రబాబు నాయుడు పాల్గొంటారన్నారు. నియోజకవర్గంలోని ముస్లిం మత పెద్దలు, నాయకులు, ముస్లిములు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

➡️