న్యాయవాదుల ద్విచక్ర వాహన ర్యాలీ

Jan 2,2024 21:54

ర్యాలీలో పాల్గొన్న న్యాయవాదులు

                        హిందూపురం : రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్చలు లేకుండా తీసుకొచ్చిన యాజమాన్య చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం స్థానిక బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు ద్విచక్ర వాహన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, హితయతుల్లా ఖాన్‌లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం వల్ల చిన్న, సన్న కారు రైతులతో పాటు దళిత, గిరిజన, పేద రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సుదర్శన్‌, నాగరాజు రెడ్డి, సిద్దు, రామచంద్రప్ప, ఈశ్వర్‌, రవికుమార్‌, మనోహర్‌, నాగేశ్వరరావు, రమేష్‌, అబ్దుల్లా, యూసుఫ్‌, ఉదరు సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️