పుట్టపర్తిలో అన్న క్యాంటీన్‌ ప్రారంభం

Feb 7,2024 21:47

భోజనం వడ్డిస్తున్న సామకోటి ఆదినారాయణ

               పుట్టపర్తి అర్బన్‌ : పట్టణంలోని సత్యమ్మ దేవాలయం వద్ద అన్న క్యాంటీన్‌ను టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారి ఆకలి తీర్చడానికి టిడిపి ప్రభుత్వం ఆనాడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిందన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాని కడుపు కొట్టి అన్న క్యాంటీన్లు రద్దు చేసిందన్నారు. కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందించాలన్న ఆశయంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. తన సొంత డబ్బులతో ఈ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగల్‌ విండో అధ్యక్షులు వెంకటేష్‌, జనసేన నాయకులు డాక్టర్‌ తిరుపతేంద్ర, ఆరవ వార్డు ఇన్‌ఛార్జి బేకరీ నాయుడు, ఐ టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జయప్రకాష్‌, నాయకులు బుగ్గపల్లి కృష్ణమూర్తి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు

➡️