పేదల పక్షపాతి వైసిపి…

Jan 4,2024 21:41

హిందూపురంలో పింఛను అందజేస్తున్న నాయకులు

                         ధర్మవరం టౌన్‌ : వైసిపి ప్రభుత్వం పేదల పక్షపాతి అనిమాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ భాగ్యలక్ష్మి, 33వ వార్డ్‌ ఇన్‌ఛార్జి బడన్నపల్లి కేశవరెడ్డి అన్నారు. 33వ వార్డు సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం భాగ్యలక్ష్మి, కేశవరెడ్డి చేతుల మీదుగా దాదాపు 370 మంది లబ్ధిదారులకు పెంచిన పింఛను మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, లబ్ధిదారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ముదిగుబ్బ : నిరుపేద పింఛను దారులకు ఆర్థిక భరోసా కల్పించడానికి వైసిపి ప్రభుత్వం జనవరి నుండి పింఛను సొమ్మును 3వేల రూపాయలకు పెంచినట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం మండల పరిధిలోని ఈదులపల్లి, రంగాపురం బండ్లపల్లి, దామానుపల్లి, మర్తాడు తదితర గ్రామాలలో పర్యటించారు. ఈసందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తిరుమల సేవే నాయక్‌, మండల కన్వీనర్‌ సివి నారాయణరెడ్డి, సీనియర్‌ నాయకులు ఇందుకూరు నారాయణరెడ్డి, మర్తాడు ఈదులపల్లి సర్పంచులు శివారెడ్డి. ప్రభాకర్‌ రెడ్డి, ఎంపీటీసీలు భవానికృష్ణారెడ్డి, వెంగళరెడ్డి, గ్రామ సచివాలయాల కార్యదర్శి భాస్కర్‌, రంజిత్‌ రెడ్డి, ముదిగుబ్బ సర్పంచు లక్ష్మీదేవి చెండ్రాయుడు తదితరులు పాల్గొన్నారు హిందూపురం : ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకోచ్చిన సంక్షేమ పథకాలతో బడుగు బలహీన నిరు పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని వైసిపి ఇన్‌చార్జ్‌ దీపిక వేణురెడ్డి అన్నారు. గురువారం రూరల్‌ మండలం కిరికెర పంచాయితీ వీవర్స్‌ కాలనీలో ఏర్పాటు చేసిన వైయస్సార్‌ పింఛన్ల కానుక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, పింఛన్‌ కార్డు, రూ.3వేల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ నరేంద్ర కుమార్‌, జెడ్పీటీసీ నాగభూషణప్ప, మండల కన్వీనర్‌ రాము, సర్పంచులు ఆనంద్‌, శ్రీనివాస్‌ రెడ్డి, సరస్వతి ఆదెప్ప, ఎంపీటీసీలు కవితా మంజునాథ్‌, రామకృష్ణారెడ్డి, బాలచంద్రతో పాటు నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️