పోరు ఆగదు..!

Dec 28,2023 09:00

పుట్టపర్తిలో మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు

           పుట్టపర్తి రూరల్‌ : ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెపోరాటం ఆగదని ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు స్పష్టం చేశారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన సమ్మె బుధవారం 8వ రోజుకు చేరుకుంది. ఆర్డీవో కార్యాలయం వద్ద దీక్షా శిబిరంలో ఉద్యోగులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. అంతకుమునుపు గణేష్‌ కూడలి నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెను మరింత ఉధతం చేస్తామని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఎస్‌ఎస్‌సి ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలన్నారు. హెచ్‌ఆర్‌ పాలసీని అమలు చేయాలని కోరారు. ఉద్యోగస్తులందరికీ ఎంటిఎస్‌ వర్తింపు చేయాలన్నారు. ఉద్యోగ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్‌ కేర్‌ లీవ్‌ అమలు చేయాలన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం నాయకులు, శ్రీనివాసులు, వెంగమ నాయుడు, ఎర్రిస్వామి, సుధాకర, నరేష్‌ బ్రహ్మానందరెడ్డి, బాబు, చెన్నరాయుడు, సునీత, శకుంతల భాయి, సుభాషితమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు.

➡️