‘బీసీలకు రాజ్యాధికారం టిడిపితోనే సాధ్యం’

Jan 22,2024 21:51

సమావేశంలో మాట్లాడుతున్న పల్లె రఘునాథరెడ్డి

                           ముదిగుబ్బ : బిసిలకు రాజ్యాధికారం టిడిపితోనే సాధ్యమని టిడిపి నాయకులు పేర్కొన్నారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో టిడిపి ధర్మవరం ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌, కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌, మడకశిర మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి, హిందూపురం అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం బీసీ సెల్‌ అధ్యక్షుడు రంగయ్య తదితరులు పాల్గొన్నారు. మాన్ని విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా బీసీ నాయకులు టిడిపి కార్యకర్తలు, నాయకులు కస్తూరిబా కాలనీ జాతీయ రహదారి వద్ద నుండి షాదీ మహల్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మార్గ మధ్యలో అంబేద్కర్‌ వాల్మీకి ఎన్టీఆర్‌ ల విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం షాదీమహల్‌ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బీసీలకు తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరిగిందని అన్నారు. బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా పట్టణం పసుపు మయంగా మారింది. ఈకార్యక్రమంలో ముదిగుబ్బ మండల నాయకులు రమేష్‌ బాబు, ప్రభాకర్‌ నాయుడు, తుమ్మల మనోహర్‌, తుమ్మల సూరి ,మహిళా అధ్యక్షురాలు రాధమ్మ, కృష్ణమూర్తి యాదవ్‌, నారాయణస్వామి, రియాజ్‌, గడ్డం మోహన తదితరులు పాల్గొన్నారు. బుక్కపట్నం : బీసీలకు రాజ్యాధికారం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మాజీమంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం మండలంలో నిర్వహించిన జయహో బిసి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామం నుంచి మండల కేంద్రం వరకు టిడిపి నాయకులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి పల్లె మాట్లాడుతూ వైసిపి పాలనలో అనేకమంది బీసీలు అనేక రకాలుగా అణిచివేతకు గురయ్యారని అన్నారు. బీసీ నేతలపై అనేక అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు కృషితో బీసీలకు తీసుకొచ్చిన అనేక చట్టాలను, రిజర్వేషన్లను వైసిపి ప్రభుత్వం తగ్గించి బీసీలకు ద్రోహం చేసిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు కేటాయించిన లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయలను దారి మళ్లించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దక్కుతుందని విమర్శించారు. పనికిమాలిన జీవోలు తీసుకొచ్చి 193 చెరువులు నింపుతానని ప్రజలను మభ్యపెట్టేందుకే వైసీపీ ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. పాదయాత్రను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాదయాత్ర పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ మలిరెడ్డి, నాయకులు సామకోటి ఆదినారాయణ, రామాంజనేయులు, జనసేన సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్‌, సాకే యశోద, లావణ్య గౌడ్‌, సయ్యద్‌ బాషా, జయరాం, గంగాధర్‌, వెంకట రాముడు తదితరులు పాల్గొన్నారు.

➡️