మౌలిక సదుపాయాలు కల్పించాలి

Feb 12,2024 22:34

సమస్యలు విన్నవించడానికి వచ్చిన మహిళలు

                      మడకశిర : మడకశిర మండలం లోని ఆయా గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ, మరుగుదొడ్లు, రోడ్డు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని పలుగ్రామాల ప్రజలు కోరారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో అర్జీ ఇచ్చేందుకు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన చేపట్టారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిత్రాన్ని ఇఒఆర్‌డి శైలజకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామాల్లో కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. మరుగుదొడ్లు లేక దూరంగా ఉన్న బయలు ప్రదేశాలకు మహిళలు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఇళ్లమధ్య మురుగు నిలబడి వ్యాధులు వ్యాపిస్తున్నాయన్నారు. మురుగు సమస్యతో ఓ శిశువు మృతి చెందిందని అన్నారు. గతంలో జరిగిన విషాదాన్ని వివరించారు. సమస్యల పరిష్కారంలో ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

➡️