యుద్ధానికి సిద్ధం : పల్లె

Feb 19,2024 21:37

సమావేశంలో మాట్లాడుతున్న పల్లె రఘునాథరెడ్డి

                    పుట్టపర్తి అర్బన్‌ : త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం కావాలని టిడిపి శ్రేణులకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం స్థానిక టిడిపి కార్యాలయంలో టిడిపి నియోజకవర్గ జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పల్లె మాట్లాడుతూ ఈ ఐదేళ్ల వైసిపి పాలనలో అరాచకాలు దౌర్జన్యాలు దోపిడీలు అధికమయ్యాయని అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. సార్వత్రిక ఎన్నికలు ఎంతో కీలకమని చెప్పారు. దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ శ్రేణులు ఏదో విధంగా తప్పుడు మార్గాలు అవలంబిస్తారని వాటిని బలంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల కన్వీనర్లు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

➡️