రాజకీయ బిక్ష పెట్టిన వారినే విమర్శించడం తగదు : టిడిపి

Jan 2,2024 21:53

విలేకరుల సమావేశంలో పాల్గొన్న టిడిపి నాయకులు

                  ధర్మవరం టౌన్‌ : ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ రోజుకో మాట పూటకో అబద్దం ఆడుతూ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట్ల విజరుకుమార్‌ విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోనుగుంట్ల సూర్యనారాయణకు పరిటాల రవీంద్ర రాజకీయ బిక్ష పెట్టారని ఆ సంగతి ఆయన మర్చిపోకూడదని అన్నారు. రాజకీయ బిక్ష పెట్టిన పరిటాల కుటుంబాన్నే విమర్శిస్తున్నాడంటే ఆయన ఎంత నీచానికి దిగజారాడో అర్థం అవుతోందన్నారు. ఎన్నికల్లో ఆయన అసమర్థతో ఓడిపోయి అది పరిటాల కుటుంబంపై ఆపాదించడం సబబసు కాదని అన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నావో చెప్పుకోలేని దుస్థితితో ఉన్నాడన్నారు. మరోసారి పరిటాల కుటుంబం గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఫణికుమార్‌, మద్దిలేటి, గొట్లూరు శీన, తలారి చంద్రమోహన్‌ బాబు, పోతుకుంట లక్ష్మన్న, మేకల రామాంజినేయులు, రాంపురంశీన, కేశగాళ్లశీన తదితరులు పాల్గొన్నారు.

➡️