వదంతులు నమ్మొద్దు : పరిటాల

Jan 18,2024 21:51

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌   

                          ధర్మవరం టౌన్‌ : ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే టికెట్‌ విషయంలో వదందులు నమ్మొద్దని ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాలశ్రీరామ్‌ తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను పట్టణంలో ఐదు రోజులపాటు నిర్వహించిన పాదయాత్రలో ప్రజలు పలు సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఇందులో ప్రధానమైన హ్యాండ్లూమ్‌ వ్యవస్థను కాపాడుకోలేకపోతే కచ్చితంగా ధర్మవరం కనుమరుగవుతుందన్నారు. అందుకే తన మొదటి ప్రాధాన్యత హ్యాండ్లూమ్స్‌ పరిరక్షణే అని అన్నారు. ముఖ్యంగా నారాలోకేశ్‌ చేనేత రంగాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారని చేనేతలకు ఎలాంటికష్టనష్టాలు లేకుండా హ్యాండ్లూమ్‌ వ్యవస్థను కాపాడుతారని అన్నారు. ఎమ్మెల్యే టికెట్‌ విషయంలో కొందరు మాట్లాడే గాలి మాటలు నమ్మవద్దని సూచించారు. ధర్మవరంలో టీడీపీజెండా ఎగురవేసేది ఖాయమన్నారు. ఈ సమావేశంలో నాయకులుకమతంకాటమయ్య, టిడిపి పట్టణ అధ్యక్షులు పరిశే సుధాకర్‌, ఫణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️