వసతిగృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి

Dec 11,2023 21:37

జీపుజాతాలో మాట్లాడుతున్న నాయకులు

                కదిరి టౌన్‌ : సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఐక్యవిద్యార్థిసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కదిరి పట్టణంలో ఐక్య విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలో సోమవారం జీపు యాత్రను చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరుణ్‌ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికై చేపట్టిన జీపు జాతా కదిరి నుండి ప్రారంభమై ధర్మవరం, పెనుగొండ, మడకశిర, హిందూపురం, గోరంట్ల, మీదుగా పుట్టపర్తి లో ముగుస్తుందన్నారు. ఈసందర్బంగా విద్యార్థి సంఘాల నాయకులు నేరుగా విద్యార్థుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వాటిని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిరంజన్‌ యాదవ్‌, నరసింహ, పోతలయ్య, సాయికుమార్‌, రాజేష్‌, యాసిన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️