‘వైసిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం’

Mar 8,2024 21:12

 వార్డు ప్రజలతో మాట్లాడుతున్న మక్బూల్‌

                      కదిరి టౌన్‌ : వైసిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైసిపి నాయకులు అన్నారు. క్రవారం కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో ఇర్ఫాన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పార్టీ సమన్వయకర్త మక్బూల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం వైసీపీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహమ్మద్‌ షాకీర్‌, రాష్ట్ర సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, పట్టణధ్యక్షులు జిలాన్‌బాషా, వైస్‌ చైర్మన్‌ అజ్జుకుంట రాజశేఖర్‌ రెడ్డి, వైసిపి నాయకులు పరికి సాదిక్‌బాషా, లింగాల లోకేశ్వర్‌ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️