వైసిపి పాలనపై తీవ్ర వ్యతిరేకత : కందికుంట

Jan 3,2024 22:25

పార్టీలోకి చేరిన వారితో కందికుంట వెంకటప్రసాద్‌

                         కదిరి టౌన్‌ : రాష్ట్రంలో జగన్‌ పాలన పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పట్టణంలోని కందికుంట నివాసంలో తలుపుల మండలంలోని పలువురు వైసిపి నాయకులు టిడిఇపలో చేరారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు శంకర్‌ ఆధ్వర్యంలో ఈదుల కుంట్ల పల్లి పంచాయతీ వైసిపికి చెందిన సర్పంచ్‌ కుమారి భారుతో పాటు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు దాదాపు 200 మంది వైసిపిని వీడి కంది కుంట సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ మేరకు కందికుంట వారికి టీడీపీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా కందికుంట మాట్లాడుతూ జగన్‌ అనాలోచిత విధానాలతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️