వైసిపి పాలనలోనే పేదలకు న్యాయం

Mar 26,2024 22:12

పార్టీలోకి చేరిన వారితో మంత్రి ఉషశ్రీ చరణ్‌, తదతరులు

                       పెనుకొండ : సిఎం జగనన్న పాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ పేర్కొన్నారు. మంగళవారం నగర పంచాయతీ పరిధిలోని 13వ వార్డులో గల చెరువుగేరిలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజలకు వివరించారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ పథకాలు తిరిగి గడప వద్దకు అందాలన్నా జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం అని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ సునీల్‌, సింగిల్‌ విండో అధ్యక్షులు సల్లా సూర్యప్రకాష్‌ రెడ్డి, టౌన్‌ కన్వీనర్‌ నరసింహ,కౌన్సిలర్లు సుధాకర్‌ రెడ్డి, క్రిష్ట, రఘునాథ్‌ రెడ్డి, గణేష్‌, సద్దాం, శేషాద్రితదితరులు పాల్గొన్నారు.వైసిపిలో పలువురు చేరిక : పట్టణంలోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని గోరంట్ల మండల పరిధిలోని పెరుమాలపల్లి గ్రామానికి చెందిన పలువురు టిడిపి నాయకులు వైసిపిలో చేరారు. గ్రామానికి చెందిన కృష్ణకుమార్‌ యాదవ్‌, సుధాకర్‌ యాదవ్‌, అంజినప్ప, కురుబ నారాయణస్వామి, రవి యాదవ్‌, శివ, విశ్వనాధ, మల్లికార్జున తదితరులు వైపిపిలో చేరారు. వారికి మంత్రి వైసిపి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

➡️