వైసీపీ గిరిజన జనగర్జన పోస్టర్లు ఆవిష్కరణ

Mar 5,2024 21:47

 పోస్టర్లు విడుదల చేస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్‌, తదితరులు

                    పెనుకొండ : ఈ నెల 10 వ తేదీన పుట్టపర్తి వేదికగా నిర్వహించే వైసీపీ గిరిజన జనగర్జన పోస్టర్లను మంత్రి ఉషశ్రీ చరణ్‌ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బంజారా సంఘ నాయకులతో కలిసి మంత్రి కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గిరిజనులకు అన్ని రంగాల్లో పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం మన వైఎస్సార్సీపీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి గిరిజ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

పుట్టపర్తి రూరల్‌ : ఎమ్మెల్యే దుద్దుకుంట స్వగ్రామమైన నల్లశింగయ్యగారి పల్లి లో వైసిపి గిరిజన గర్జన పోస్టర్లను పుట్టపర్తి శాసన సభ్యులు దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. ఈనెల 10న పుట్టపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం ముందు గల ప్రాంగణంలో జరిగే వైసిపి గిరిజన గర్జన కార్యక్రమానికి గిరిజన సోదరులు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు దుంగవత్‌ రమేష్‌ నాయక్‌, జిల్లా ఎస్టీ సెల్‌ అధ్యక్షులు పెడపల్లి తిరుపాల్‌ నాయక్‌, గోరంట్ల సర్పంచి సరోజా నాగే నాయక్‌, గిరిజన సంఘం నాయకులు రవి నాయక్‌, గిరిజన సంఘ నాయకులు ప్రజాప్రతినిధులు, వైసిపి శ్రేణులు పాల్గొన్నారు.

➡️