శతాధిక వృద్ధురాలికి ‘పల్లె’ పరామర్శ

Dec 13,2023 22:41

వృద్ధురాలిని పరామర్శిస్తున్న పల్లె రఘునాథరెడ్డి

                పుట్టపర్తి రూరల్‌ సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న 109 ఏళ్ల శతాధిక వృద్ధురాలు కుర్లి లక్ష్మమ్మను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి బుధవారం పరామర్శించారు. ఓబుళదేవరచెరువు మండలం తిప్పేపల్లి పంచాయతీ ఉంట్లవారి పల్లి కి చెందిన 109 సంవత్సరాల లక్ష్మమ్మ రెండు రోజుల కిందట ఇంటి వద్ద కిందికి పడటంతో కాలు విరిగింది. దీంతో పుట్టపర్తి సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి బుధవారం పరామర్శించారు. ఈసందర్భంగా పల్లె మాట్లాడుతూ 109 ఏళ్లు కలిగిన లక్ష్మమ్మ మంచి ఆహార అలవాట్లతో ఆరోగ్యంగా ఉందన్నారు. అనంతరం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నియోజకవర్గంలోని పుట్టపర్తి మండలం యర్ర నాగప్ప , నంజప్ప, కొత్త చెరువుకు చెందిన లక్ష్మీదేవి మనవరాలు శశాంక్‌, కర్నాటక నాగేపల్లి చెందిన చిన్న నరసింహులు తదితరులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్‌ నాయకులు ఓబులేసు, బొమ్మయ్య, అంబులెన్స్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️