శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలి

Jan 7,2024 21:45

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులతో జెవివి నాయకులు

                హిందూపురం:విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌ సూచించారు. స్థానిక మేళాపురంలోని దీప్తి పాఠశాలలో ఆదివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి ట్యాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా కమిషనర్‌తో పాటు ఎంఇఒలు గంగప్ప, ప్రసన్నలక్ష్మీ, పాఠశాల కరస్పాండెంట్‌ అబ్రహం కుట్టియాంకల్‌, జేవీవీ జిల్లా కార్యదర్శి ఆదిశేషు, రామకృష్ణ, ఈటీ రామ్మూర్తి హాజరై మాట్లాడారు. మూఢనమ్మకాలు ప్రగతికి అవరోధాలని, కావున విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు. ట్యాలెంట్‌ టెస్టులో బిఎస్‌ఆర్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల(ధర్మవరం) విద్యార్థులు ఈశ్వర్‌, ఓబులేసు, నగేష్‌ కుమార్‌, ప్రయివేటు పాఠశాలల విభాగంలో ఒడిసిలోని రెయిన్‌బో హైస్కూల్‌ విద్యార్థులు యశ్వంత్‌నాయుడు, లయశ్రీ, మేఘనాథ్‌ విజేతలుగా నిలిచారు. రు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జేవీవీ నాయకులు వెంకటరామిరెడ్డి, నారాయణస్వామి, రామకృష్ణ, శ్రీనివాసులు, రవీంద్రారెడ్డి, ఉగ్రప్ప, అంజనారెడ్డి, బాలగంగాధర్‌ తిలక్‌, హరి, ఓబులేసు, మురళీమోహన్‌, ఇమ్రాన్‌బాషా పాల్గొన్నారు.

➡️