సడలని సంకల్పం

Dec 20,2023 22:24

అగళిలో నిర్వహించిన భిక్షాటనలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌

        అగళి : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేదాకా సమ్మె కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో బుధవారం అంగన్వాడీలు బిక్షాటన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంతియాజ్‌ మాట్లాడుతూ అంగన్వాడీలు తొమ్మిదిరోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీలు, సిపిఎం, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. మడకశిర : అంగన్వాడీల సమ్మెలో భాగంగా బుధవారం అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తొమ్మిదవ రోజు చెవిలో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ధర్మవరం టౌన్‌ : ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీ యూనియన్‌ నాయకులు హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారానికి తొమ్మిదవ రోజుకు చేరింది. అంగన్వాడీలకు మున్సిపల్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సంఘీబావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా నాయకులు జంగాలపల్లి పెద్దన్న, సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆదినారాయణ, అయూబ్‌ ఖాన్‌, రైతుసంఘం మండల అధ్యక్షులు మారుతి తదితరులు పాల్గొన్నారు. కదిరి అర్బన్‌ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం అంగనవాడీలు సిఐటియు ఆధ్వర్యంలో ఆర్‌ అండ్‌ బి బంగ్లా నుండి వేమారెడ్డి సర్కిల్‌ అంబేద్కర్‌ సర్కిల్‌ ఇందిరాగాంధీ సర్కిల్‌ మీదుగా మున్సిపల్‌ కార్యాలయం వరకు భిక్షాటన కార్యక్రమం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు మాబున్నీసా, లక్ష్మీదేవి, సుజాత, రామలక్ష్మి, శారద, సరోజతో పాటు సిఐటియు నాయకులు జిఎల్‌ నరసింహులు, జగన్మోహన్‌ రామ్మోహన్‌ ,శివ తదితరులు పాల్గొన్నారు. కొత్తచెరువు : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తొమ్మిది రోజులుగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ విమర్శించారు.కొత్తచెరువు, బుక్కపట్నం ,పుట్టపర్తి, మండలాలకు చెందిన అంగనవాడీలు బుధవారం కొత్తచెరువు బస్టాండ్‌ కూడలిలో నిరసన తెలిపి దుకాణాల వద్ద భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ర్యాలీగా తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకొని అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ముత్యాలు, లక్ష్మయ్య, అంగన్వాడీలు షర్మిల, ఉమాదేవి, సరస్వతి, రాధా తదితరులు పాల్గొన్నారు. ఓబుళదేవరచెరువు :. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం మండలంలోని మహమ్మదాబాద్‌ క్రాస్‌ వద్ద సిడిపిఒ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు కళ్లకు నల్లగంతులు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు సిఐటియు మండల అధ్యక్షులు కుల్లాయప్ప కార్యదర్శి శ్రీరాములు మద్దతు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకురాలు ఆశీర్వాదమ్మ, మణిమాల, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు. చిలమత్తూరు : 9వ రోజు సమ్మె సందర్భంగా బుధవారం అంగన్వాడీలు మండల కేంద్రంలో భిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఫిరంగి ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ తొమ్మిది రోజుల నుంచి సమ్మెలో ఉన్న అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వెంకటేష్‌, లక్ష్మీనారాయణ, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు శోభారాణి, రామ తులసి, పద్మావతి, జయమ్మ, వనజ, సునీత, శారద, పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు. తలుపుల : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు బుధవారం మండలకేంద్రంలో బిక్షాటన చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకురాలు సుశీల, అంగన్వాడీలు పాల్గొన్నారు. నల్లచెరువు : మండల కేంద్రంలో అంగన్వాడీలు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కౌన్సిల్‌ సభ్యులు శ్రీరాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కోశాధికారి రమేష్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పద్మావతి, సరస్వతి, వివిధ గ్రామాలకు చెందిన అంగన్వాడీలు పాల్గొన్నారు. బత్తలపల్లి : మండల కేంద్రంలో బుధవారం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారానికి తొమ్మిదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా శ్రామిక మహిళ కన్వీనర్‌ దిల్షాద్‌ ఆధ్వర్యంలో అంగన్వాడీలు భిక్షాటన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షురాలు వాసంతి, ప్రధాన కార్యదర్శి రజియా, వసంత, రజిత, పుష్పలత, శివమ్మ సుగుణ, క్రిష్టవేణి, జయసుధ, సున్నీబేగం తదితరులు పాల్గొన్నారుగాండ్లపెంట : మండల కేంద్రంలోని బుధవారం అంగన్వాడీ కార్యకర్తలు దుకాణాల వద్ద భిక్షాటన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు లక్ష్మీదేవి, భారతితో పాటు అంగన్వాడీలు పాల్గొన్నారు పెనుకొండ : తమ సమస్యలు పరిష్కారం కోసం అంగన్వాడీలు బుధవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు వంటా వార్పు చేపట్టారు. ఈ సందర్బంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు సిపిఎం మండల కమిటీ మద్దతు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరి, రమేష్‌, మండల కమిటీ సభ్యులు ఫక్రుద్దీన్‌, తిప్పన్న, బాబావలి, గంగాధర్‌, వెంకటరాముడు, ఉత్తప్ప, ఇంద్ర ,వెంకటేష్‌, బాబు, షాషావలి, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు బావమ్మ, జయమ్మ, మాబున్నీసా, వర లక్ష్మి, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. ముదిగుబ్బ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు బుధవారం మండల కేంద్రంలో భిక్షాటన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న, సిఐటియు నాయకులు బాబు, వెంకటేష్‌, పోతలయ్య, లక్ష్మీనారాయణ, రహంతుల్లా, చాంద్‌బాషా, అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్షురాలు రజియా, అంగన్వాడీలు ఇందుమతి పాల్గొన్నారు. గుడిబండ : అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి 9వ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా మండలంలోని అంగన్వాడీ వర్కర్లు గ్రామంలో భిక్షాటన చేపట్టారు. రోడ్డుపైనే వంటావార్పులు చేపట్టి అక్కడే అందరూ భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో గుడిబండ ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌. కార్యదర్శి మహాదేవమ్మ, కోశాధికారి లక్ష్మీదేవి, మండలంలోని అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. హిందూపురం :అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె బుధవారానికి తొమ్మిదవ రోజుకు చేరింది. ఆందోళనలో భాగంగా బుధవారం పట్టణంలోని సద్భావన సర్కిల్‌లో మోకాళ్ళపై నిల్చుని, ఉరి తాళ్ళకు వేలాడుతూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనిపక్షంలో భవిష్యత్తులో మీకు సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి శ్రీదేవి, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి రమణ, స్థానిక అంగన్వాడీ యూనియన్‌ నాయకులు లావణ్య, శిరీష, శైలజ, టిడిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి పరిమళ, కౌన్సిలర్లు మంజుళ, మహాలక్ష్మి, భారతి, కాంగ్రెస్‌ బాలాజి మనోహర్‌, జమీల్‌తో పాటు వివిధ పార్టీల నాయకులతో పాటు పెద్ద ఎత్తున అంగన్వాడీలు పాల్గొన్నారు. లేపాక్షి : మండలం పరిధిలోని అంగన్వాడీలు బుధవారం సమ్మె లో భాగంగా బిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️