సమస్యల నిలయంగా ధర్మవరం : పరిటాల

Jan 5,2024 22:01

 వార్పును పరిశీలిస్తున్న పరిటాల శ్రీరామ్‌

                    ధర్మవరం టౌన్‌ : ధర్మవరం పట్టణాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే సమస్యలకు నిలయంగా మార్చారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాలశ్రీరామ్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన చేపట్టిన ప్రజాచైతన్య పాదయాత్ర రెండవరోజు శుక్రవారం కొనసాగింది. ఈసందర్భంగా పరిటాల శ్రీరామ్‌ పలు కాలనీల్లో పర్యటించారు. శాంతినగర్‌, చంద్రబాబునగర్‌, శారదానగర్‌, శివానగర్‌, తిక్కస్వామినగర్‌, సీపీఐకొట్టాల, కేశవనగర్‌లో పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్బంగా పలు కాలనీల్లో ప్రజలు తమ సమస్యలను పరిటాల శ్రీరామ్‌ దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు, డ్రయినేజీలు, రేషన్‌కార్డులు, పింఛన్లు ఇలా పలు సమస్యలను ఆయనకు విన్నవించారు. మైనార్టీ నేతలు పరిటాల శ్రీరామ్‌నుకలిసి వినతిపత్రం అందజేశారు. వక్ఫ్‌్‌ బోర్డు ఆస్తుల పరిరక్షణ, ముస్లీం మైనార్టీలను వివక్షకు గురికాకుండా అట్రాసిటీ చట్టం, దుల్హన్‌ పథకాన్ని రూ.50వేల నుంచి రూ.1లక్షవరకు పెంచాలని, మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు, 50శాతం సబ్సిడీతో రుణాలువంటి అంశాలను పరిటాల శ్రీరామ్‌ దష్టికి తెచ్చారు. పలువురు టిడిపిలో చేరిక : పరిటాల శ్రీరామ్‌ చేపట్టిన పాదయాత్రలో భాగంగా 5వ వార్డులో వైసీపీలో కీలకంగా పనిచేస్తున్న 30 మంది యువకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ శ్రీరామ్‌ వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నిజాం, అరవింద్‌, మహమ్మద్‌, కుల్లాయి, మనీ, ప్రశాంత్రెడ్డి, యతీV్‌ా, వెంకటేశ్‌ తదితరుల ఆధ్వర్యంలో పార్టీలోకి చేరారు. గాలిమాటలు నమ్మొద్దు : గాలిమాటలు నమ్మవద్దని, ధర్మవరంలో టీడీపీ జెండా ఎగురవేసేది పరిటాలశ్రీరామే అని మాజీ మంత్రి పరిటాల సునీత పార్టీ కార్యకర్తలకు చెప్పారు. పరిటాలశ్రీరామ్‌ రెండవ రోజు చేపట్టిన పాదయాత్రలో మాజీ మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు. ఈసందర్భంగా పలు కాలనీలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాటాడుతూ… పరిటాల శ్రీరామ్‌ పాదయాత్రకు మంచి స్పందన వస్తోందన్నారు.

➡️