సాగు భూములకు పట్టాలు ఇప్పించండి

సాగు భూములకు పట్టాలు ఇప్పించండి

 మహిళలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి

         బత్తలపల్లి : సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు, ఇళ్లు లేని నిరుపేదలకు గృహాలు మంజూరు చేయాలని పలువురు మహిళలు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని కోరారు. ఎమ్మెల్యే శుక్రవారం మండల పరిధిలోని చీమలనాగేపల్లి గ్రామంలో వైసిపి నాయకుడు గవిరెడ్డి అరవిందరెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రామ సమీపంలో కొండగుట్టల్లో భూమిని చదును చేసుకున్నామని వాటికి పట్టాలు ఇప్పించాలని కోరగా భూ పంపిణీ కార్యక్రమంలో అర్హులందరికీ పంపిణీ చేస్తారని తెలిపారు. కొందరు ఇళ్లు మంజూరు చేయాలని కోరగా 2వ విడతలో మంజూరు చేస్తామన్నారు. అనంతరం ఎం.చెర్లోపల్లి వెళ్లి వైసిపి నేత ప్రతాపరెడ్డి ఇంట్లో తేనీటి విందు స్వీకరించారు. బత్తలపల్లి ఎస్‌ఐ శ్రీనివాసులు బందోబస్తును పర్యవేక్షించారు. ఎమ్మెల్యే వెంట ఎపి కురుబ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోటి సూర్యప్రకాష్‌బాబు, వైసిపి జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్‌ జయరామిరెడ్డి, నాయకులు రాంభూపాల్‌రెడ్డి, బగ్గిరి జయపరెడ్డి, బండి నాగభూషణ, బోయపాటి సూరి, నరేంద్రరెడ్డి, శ్రీరామరెడ్డి, సరసారెడ్డి, పురుషోత్తంరెడ్డి ఉన్నారు.

➡️