హామీలు అమలు చేయాలి

Feb 16,2024 22:06

కమిషనర్‌ చాంబర్‌ ముందు ఆందోళన

                     హిందూపురం : గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు స్థానికంగా మున్సిపల్‌ కమిషనర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి సాంబశివ డిహాండ్‌ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తు శుక్రవారం సిఐటియు ఆద్వర్యంలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు మున్సిపల్‌ కమిషనర్‌, చైర్‌ పర్సన్‌ చాంబర్‌ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా సాంబశివ మాట్లాడుతు సమ్మె సమయంలో ఇచ్చిన హామీలు నేటికి అమలు చేయలేదన్నారు. వీటిని అమలు చేయక పోతే తాము మరో సారి మెరుపు సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజప్ప, రామక్రిష్ణ, మున్సిపల్‌ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి జగదీష్‌, కోశాధికారి ఆనంద్‌, గురునాథ్‌, పరమేష్‌, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️