ఉప సర్పంచిపై చర్యలు తీసుకోవాలి

గోరంట్ల ఉపసర్పంచి రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు

       గోరంట్ల : గోరంట్ల మేజర్‌ గ్రామపంచాయతీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న వినోద్‌ను దుర్భాషలాడిన ఉప సర్పంచి రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం గ్రామపంచాయతీ కార్మికులు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే పట్టణంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ దళితులను చులకనగా చూడటం తగదన్నారు. దీనిపై గ్రామ కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ ఎలక్ట్రీషియన్‌ పట్ల ఉప సర్పంచి దురుసుగా మాట్లాడడం బాధాకరం అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు న్యాయం జరిగేంత వరకూ కార్మికులకు అండగా ఉంటామని ఆయన తెలిపారు.

గోరంట్ల ఉప సర్పంచిని తొలగించాలి : సిఐటియు

       ముదిగుబ్బ  : గోరంట్ల మేజర్‌ పంచాయతీలో పని చేస్తున్న ఎలక్ట్రీషియన్‌ను దుర్భాషలాడిన, కార్మికులను కించ పరచిన ఉపసర్పంచి రాజారెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని సిఐటియు మండల కార్యదర్శి ఆటో పెద్దన్న డిమాండ్‌ చేశారు. పారిశుధ్య కార్మికులు, ఎలక్ట్రీషియను, వాటర్‌ మ్యాన్లు పని చేయకపోతే ప్రజల జీవనం దుర్భరమవుతుందన్నారు. అలాంటి వారిని అధికార మదంతో దూషించడం చట్టరీత్యా నేరమని, వెంటనే రాజారెడ్డి ఎలక్ట్రీషియన్‌కు బే షరతుగా క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో నోరు అదుపులో పెట్టుకొని కార్మికులను మర్యాదపూర్వకంగా మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. లేనిచో సిఐటియు, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని  హెచ్చరిం చారు. అలాగే పారిశుధ్య కార్మికులకు అధికారులు సకాలంలో వేతనాలు, అరియర్స్‌ చెల్లించాలని కోరారు.

➡️