ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

May 24,2024 21:38

సమావేశంలో పాల్గొన్న డిఆర్‌ఒ, ఎఎస్పీ

                     పుట్టపర్తి అర్బన్‌ : డిప్యూటీ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ చేపట్టే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో డిఆర్‌ఒ మాట్లాడుతూ శనివారం ఈ పరీక్షలను ప్రశాంతి గ్రామ్‌ బీడుపల్లికి వెళ్లే రోడ్డులో గల సంస్కృతి స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 110 మంది హాజరు కాబోతున్నారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ ఫోన్లు, క్యాలిక్యులేటర్‌, ట్యాబ్స్‌, ఐప్యాడ్‌, బ్లూటూత్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు, హ్యాండ్‌ బ్యాగులు, రైటింగ్‌ ప్యాడ్లు అనుమతి లేదన్నారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు ఈ పరీక్షల నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు 7:30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇస్తామన్నారు. ఉదయం 8:30 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. విద్యుత్‌ సరఫరా లో ఎలాంటి అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ విష్ణు, ఏపీపీఎస్‌ సెక్షన్‌ ఆఫీసర్లు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

➡️