హిందూపురానికి బాలకృష్ణ

ర్యాలీగా హిందూపురం వస్తున్న నందమూరి బాలకృష్ణ

          హిందూపురం : ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటన అనంతరం శనివారం మొదటి సారిగా నందమూరి బాలకృష్ణ హిందూపురం విచ్చేశారు. ఈ సందర్భంగా టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు తూమకుంట చెక్‌పోస్టు వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి సూగూరు ఆంజనేయ స్వామి దేవస్థానం చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి ప్రచార రథంపై ఎమ్మెల్యే బాలకష్ణ పుర ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు ఆయనతో కలిసి ద్విచక్ర వాహనంలో బెంగళూరు రోడ్డు, మెయిన్‌ బజార్‌, అంబేద్కర్‌ సర్కిల్‌, గురునాథ్‌, తెలుగు తల్లి సర్కిల్‌ మీదుగా బాలకష్ణ నివాసం వరకు వేలాది మందితో ద్విచక్ర వాహన ర్యాలీగా నివాసం చేరుకున్నారు. బాలయ్యను చూసేందుకు ప్రజలు రోడ్డుపక్కన పెద్ద ఎత్తున నిల్చొన్నారు. మహిళలు జై బాలయ్య.. జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మూడు కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణ క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

➡️