గోనుగుంట్ల అభిమానుల ప్రచారం

Apr 17,2024 22:10

 ప్రచారంలో పాల్గొన్న గోనుగుంట్ల సూర్యనారాయణ అభిమానులు

                    ధర్మవరం టౌన్‌ : ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని రేగాటిపల్లి చిలకం సూర్యనారాయణ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయనతో పాటు గోనుగుంట్ల అభిమానులు బుధవారం ధర్మవరం మండలంలోని ముచ్చురామి సీతారాం పల్లి, రేగాటిపల్లి తదితర గ్రామాలలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోనుగుంట్ల సూర్యనారాయణ అభిమానులు పరమేష్‌, శేఖర్‌, లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

➡️