బాలయ్యను ఆదరించండి..

Apr 13,2024 22:15

ఎన్నికల ప్రచారంలో నందమూరి వసుంధరదేవి, తదితరులు

                     చిలమత్తూరు : హిందూపురం నియోజక వర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన బాలయ్య ముచ్చటగా మూడో సారి విజయకేతనం ఎగరవేసేలా ఆదరించాలని బాలక్రిష్ణ సతీమణి వసుంధర దేవి అన్నారు. ఈ మేరకు ఆమె సోమగట్ట పంచాయతీలో శనివారం హిందూపురం నియోజకవర్గం అభ్యర్థి బాలక్రిష్ణ, పార్లమెంటు అభ్యర్థి పార్థ సారధికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమం లో బాలక్రిష్ణ సోదరి లోకేశ్వరి, అల్లుడు భరత్‌, ఐటి వింగ్‌ అధ్యక్షురాలు తేజశ్విని పాల్గొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ హిందూపురం నియోజక వర్గాన్ని తన సొంత నిధులతో బాలక్రిష్ణ అభివృద్ధి చేశారని అన్నారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య రథం పేరిట ప్రజలకు ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్నారని చెప్పారు. అలాగే గ్రామీణ రోడ్లు, నీటి సమస్యను బాలక్రిష్ణ పరిష్కరించారని అన్నారు. బాలక్రిష్ణను మూడో ఆదరించి నియోజక వర్గం మరింత అభివృద్ధి జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమం లో స్థానిక టీడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

హిందూపురం : హిందూపురం శాసన సభ్యుడిగా మూడో సారి పోటీ చేస్తున్న నందమూరి బాలక్రిష్ణను ప్రజలు ఆదరించాలని నందమూరి వసుంధర కోరారు. ఈ మేరకు ఆమె శనివారం బాలయ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని సూగూరు ఆంజినేయ స్వామి ఆలయంలో కుటుంబ సభ్వులతో కలిసి ప్రత్యేక పూజల అనంతరం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️