పాంచజన్యలో అంతర్జాతీయ ప్రమాణాలు

చిన్నారులతో పాంచజన్య శ్రీనివాసులు, ఉపాధ్యాయులు

        హిందూపురం : పట్టణంలోని పాంచజన్య పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులకు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు పాఠశాల అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు తెలియజేశారు. శుక్రవారం నాడు పాఠశాలలో ప్రీ ప్రైమరీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్‌ డేను నిర్వహించారు. యూకేజి పూర్తి చేసుకుని, ప్రైమరీ విద్యకు నాంది పలుకుతున్న సందర్బంగా ప్రీ ప్రైమరీ విద్యార్థులకు పాఠశాల అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు, కరస్పాండెంట్‌ నంద కుమార్‌లు మార్కుల మెమోతో పాటు పట్టా, మిఠాయి అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, ఉన్నత పాఠశాల విద్యార్థులకు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలియజేశారు. ప్రాథమిక స్థాయిలో ప్రతి విద్యార్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గాయత్రి, ఏవో భాస్కర్‌, పాఠశాల సూపరింటెండెంట్‌ విజయేంద్ర, ఎహెచ్‌ఎంలు శశికళ, సతీష్‌ కుమార్‌, అబ్దుల్‌ రజాక్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️