తీరు మారని చంద్రబాబుకు బుద్ది చెబుదాం : మంత్రి

Apr 16,2024 21:24

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పెది్దరడ్డి రామచంద్రారెడ్డి

               నంబులపూలకుంట : తీరు మార్చుకోని చంద్రబాబునాయుడుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రాష్ట్ర మంత్రి, వైసిపి ఉమ్మడి జిల్లా రీజినల్‌ కోఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం మండల పరిధిలోని పెడబల్లి గ్రామంలో యువజన పారిశ్రామికవేత్త హరీష్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఐదేళ్లలో రాష్ట్రంలో అనేకసంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. ప్రజలు ఎన్నిసార్లు బుద్ది చెప్పినా చంద్రబాబులో మార్పురాదన్నారు. చంద్రబాబు మోసపుమాటలను రాష్ట్రప్రజలు నమ్మకూడదని కోరారు. టిడిపి, వైసిపి పాలనలోని వ్యత్యాసాలను ఈసందర్భంగా మంత్రి వివరించారు. అబద్ధపు హామీలతో మోసం చేసే చంద్రబాబుకు అవకాశం ఇస్తే రాష్ట్రం అంధకారమవుతుందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్‌ మక్బూల్‌, హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థి బోయ శాంతమ్మను అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి హిందూపురం పార్లమెంట్‌ ఎన్నికల ఇన్‌ఛార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్‌ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జి పూల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌ బాషా, వైసిపిబీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తల హరిప్రసాద్‌, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తల వెంకటరమణ, మాజీ సమన్వయకర్త ఎస్‌ఎమ్‌డి ఇస్మాయిల్‌, లీగల్‌ సెల్‌ జోనల్‌ ఇన్‌ఛార్జి లింగాల లోకేశ్వర్‌ రెడ్డి, వైసిపి నాయకులు సాధత్‌ అలీఖాన్‌, హిందూపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, స్థానిక వైసిపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గాండ్లపెంట: వైసిపి పార్లమెంట్‌ అభ్యర్థి శాంతమ్మ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్‌ మక్బూల్‌ బాషాను గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క వైసీపీ కుటుంబ సభ్యులకు ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలోని ఎస్సార్‌ ఫంక్షన్‌ హాల్‌ మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ వైసిపి చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈసందర్భంగా మండల పరిధిలోని సోమయాజులపల్లి తోపల్లి కురుమామిడి గాండ్లపెంట తదితర గ్రామాల నుంచి 300 మంది వైసీపీ లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌ బాషా వైసిపి నాయకులు పూల శ్రీనివాసులు, వజ్ర భాస్కర్‌ రెడ్డి, ఎంపీపీ జగన్మోహన్‌, నాయకులు పోరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, జి రవీంద్రారెడ్డి, ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కదిరి అర్బన్‌ : జగనన్నను రెండవసారి ముఖ్యమంత్రి చేసుకుందామనిమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం పర్యటనలో భాగంగా కదిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. కదిరిలోని అత్తర్‌ రెసిడెన్షియల్‌ దత్త ఫంక్షన్‌ హాల్‌ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపీని గెలిపించే బాధ్యత నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్‌ అహ్మద్‌, మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌ బాషా, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ బత్తల హరిప్రసాద్‌, జాతీయ బీసీ సంఘం నాయకులు డాక్టర్‌ బత్తల వెంకటరమణ, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూల శ్రీనివాసరెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రిని కలిసిన విజయభాస్కర్‌ : ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా కదిరి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎస్కే పాలకమండలి సభ్యులు కొమ్ము విజయభాస్కర్‌ రెడ్డి కలిశారు. యూనివర్సిటీ అభివద్ధిపై మంత్రితో చర్చించినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని రాజకీయ అంశాలను మంత్రి అడిగినట్లు పాలకమండలి సభ్యులు తెలిపారు. ఈకార్యక్రమంలో కొమ్ము సాయి, సీనియర్‌ న్యాయవాది సివి. కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️