ప్రభుత్వ భూమిని కాపాడండి

May 23,2024 20:55

ఆక్రమణను చూపుతున్న వామపక్ష నాయకుడు

                       నంబుల పూలకుంట : మండలకేంద్రానికి సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు రావడంతో భూములు విలువ బాగా డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో కొందరు స్వార్థపరులు ప్రభుత్వ భూములపై కన్నేశారురు. ప్రభుత్వ భూమిని కాపాడవలసిన రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో కబ్జారాయుళ్ల ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. మండల కేంద్రంలోని మిట్ట కింద కొత్తగా సీసీ రోడ్డు ఏర్పాటు చేశారు. ఆ రోడ్డు ప్రక్కన వేసిన లేఅవుట్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. రెవెన్యూ అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోలేదు. భూ ఆక్రమణపై స్థానిక వామపక్ష నాయకుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భూ ఆక్రమ దారులకు కొందరు రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణలో ఉన్న భూమిని పరిరక్షించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

➡️