టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి

May 6,2024 22:15

 రోడ్‌ షోలో బాలకృష్ణ

                 హిందూపురం : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆపార్టీ హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం హిందూపురం పట్టణంలోని కొల్లకుంట, ఇందిరమ్మ కాలనీ, కొట్నూరు,చౌడేశ్వరి కాలనీ,ఆర్టీసీ కాలనీ త్యాగరాజు నగర్‌, ముక్కడిపేట తదితర ప్రాంతాల్లో రోడ్‌ షో, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా బాలకృష్ణకు ఆయా ప్రాంతాల్లో నాయకులు గజమాలలతో స్వాగతం పలికారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4వేలు పింఛను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంజినప్ప, పట్టణ అధ్యక్షులు రమేష్‌ కుమార్‌, న్యాయవాది శివశంకర్‌తో పాటు పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.

➡️