అంతన్నారు… కొంతే కొన్నారు

ఖరీఫ్‌ సీజన్‌లో 3,51,843 ఎకరాల్లో వరి వేశారు. ఈ సంవత్సరం 8.17 లక్షల మెట్రిక్‌

బూర్జ మండలంలో ధాన్యాన్ని తరలిస్తున్న దళారులు (ఫైల్‌)

2023 ఖరీఫ్‌లో 5.40 లక్షల టన్నులను సేకరించాలని నిర్ణయం

కొనుగోలు చేసింది 4.49 లక్షల మెట్రిక్‌ టన్నులే

కరువు, ప్రయివేట్‌ వ్యాపారుల ఫలితంగా తగ్గిన కొనుగోలు

రేపటితో ముగియనున్న ధాన్యం సేకరణ

జిల్లాలో ధాన్యం కొనుగోలు ఈ నెల 31తో ముగియనుంది. ధాన్యం సేకరణలో తొలుత సాంకేతిక సమస్యలు, ధాన్యం నాణ్యంగా లేవని మిల్లరు నిరాకరించడం వంటి సమస్యలు ఎదురయినా క్రమేణా కొనుగోలు పుంజుకున్నాయి. అయితే చివరికొచ్చే సరికి లక్ష్యం మేర కొనుగోలు జరగలేదు. ఖరీఫ్‌లో ఇప్పటివరకు – లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు చేశారు. ఖరీఫ్‌లో కరువు పరిస్థితుల కారణంగా వేలాది ఎకరాల్లో రైతులు పంటలు వేయలేకపోయారు. వర్షాలు సకాలంలో పడకపోవడంతో వేసిన పంటలూ ఎండిపోయాయి. ధాన్యం కొనుగోలులో నిబంధనలతో రైతులు వ్యాపారులకు, దళారులకు ధాన్యం అమ్ముకున్నారు. ఫలితంగా ఈ సంవత్సరం అనుకున్నంత స్థాయిలో కొనుగోలు జరగలేదనే అభిప్రాయం వినిపిస్తోంది.

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

ఖరీఫ్‌ సీజన్‌లో 3,51,843 ఎకరాల్లో వరి వేశారు. ఈ సంవత్సరం 8.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 7,87,447 మెట్రిక్‌ టన్నులు మార్కెట్‌లోకి వస్తుందని భావించారు. ప్రభుత్వం 5.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ధాన్యం కొనుగోలుకు అధికారులు ఈ నెల 31 తేదీని గడువుగా ప్రకటించిన సంగతి విదితమే. సేకరణకు రెండు రోజులే మిగిలి ఉండగా ఇప్పటివరకు 4,48,917 మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేశారు. ఇందులో గ్రేడ్‌-ఎ రకం 282 మెట్రిక్‌ టన్నులు కాగా, సాధారణ రకం 4,48,635 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. ప్రభుత్వం కొనే పరిస్థితి ఉన్నా రైతుల దగ్గర ధాన్యం లేనట్లు తెలుస్తోంది. రైతులు ఆర్‌బికెల దగ్గరకు వచ్చి తమ ధాన్యం కొనాలని ఎవరూ అడగడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా తెరుచుకుంటున్నాయి.ఆ రెండు చోట్ల వెయ్యి టన్నుల లోపేజిల్లాలో గ్రేడ్‌-ఎ, సాధారణ రకం ధాన్యం కలిపి మొత్తం 4,48,635 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కంచిలిలో అత్యల్పంగా కేవలం 712 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. కవిటిలో 803 మెట్రిక్‌ టన్నులు, ఎచ్చెర్లలో 3,374 మెట్రిక్‌ టన్నులు ఇచ్ఛాపురంలో 3,537 మెట్రిక్‌ టన్నులు, రణస్థలంలో 4,428 టన్నులు, లావేరులో 4,830 మెట్రిక్‌ టన్నులు. పొందూరులో 6,128 టన్నులు ధాన్యాన్ని సేకరించారు. జిల్లాలో అత్యధికంగా జలుమూరులో 32,415 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత స్థానంలో నరసన్నపేట ఉంది. నరసన్నపేటలో 27,164 టన్నులను కొన్నారు. సారవకోటలో 25,309 టన్నులను కొనుగోలు చేశారు. కోటబొమ్మాళిలో 24,301 టన్నులు, నందిగాంలో 22,503 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అదేవిధంగా మెళియాపుట్టిలో 21,624 మెట్రిక్‌ టన్నులు, కొత్తూరులో 20,523 మెట్రిక్‌ టన్నులు, మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు.2022 ఖరీఫ్‌లో కొనుగోలు పరిస్థితి ఇలా…2022-23 సీజన్‌లో 3,82,550 ఎకరాల్లో వరి సాగైంది. అందులో 8,11,120 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసి, 4.38 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. ఖరీఫ్‌లో సానుకూల పరిస్థితులు నెలకొనడం, పంట గణనీయంగా రావడంతో 5.40 లక్షల టన్నులను కొనుగోలు చేశారు. తొలుత 4.80 లక్షల టన్నులతో ఆపేయాలని ప్రభుత్వం భావించింది. ప్రజాప్రతినిధులపై రైతులు తీవ్ర ఒత్తిళ్లు తీసుకురావడంతో 20, 30 టన్నులు పెంచుకుంటూ చివరకు 5.40 లక్షల టన్నులతో ఆపేసింది. 2022-23 ఖరీఫ్‌లో తక్కువ లక్ష్యం నిర్ధేశించుకుని ఎక్కువ కొనుగోలు జరపగా 2023-24 ఖరీఫ్‌లో ఎక్కువ లక్ష్యం నిర్ధేశించుకుని తక్కువ కొనుగోలు జరపడం గమనార్హం. లక్ష్యం చేరుకోకపోవడానికి కారణాలివేనా?ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఇచ్ఛాఫురం, సోంపేట, కంచిలి, కవిటి మండలాల్లో కరువు పరిస్థితులు తలెత్తాయి. వీటితో పాటు పలాస నియోజకవర్గంలోని పలాస, వజ్రపుకొత్తూరు, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని జి.సిగడాం తదితర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల పంట అనుకున్నంత స్థాయిలో రాలేదు. ధాన్యం సేకరణకు ఈ సంవత్సరం విధించిన కొత్త నిబంధనలూ ధాన్యం లక్ష్యం చేరుకోకపోవడానికి మరో కారణంగా ఉంది. వాహనాలకు జిపిఎస్‌, మిల్లుల వద్ద రోజుల తరబడి నిరీక్షణ వంటి ఇబ్బందులు పడలేక రైతులు పలు చోట్ల దళారులకు అమ్ముకున్నారు. దీంతో పాటు ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా తెరుచుకోకముందే పచ్చి ధాన్యాన్ని సైతం కమిషన్‌ ఏజెంట్లు కొనుగోలు చేశారు. రాష్ట్రంలో పలు జిల్లాలో కరువు పరిస్థితుల కారణంగా పంట లేకపోవడంతో ఆయా ప్రాంతాలకు జిల్లా నుంచి ధాన్యం రవాణ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సంవత్సరం ధాన్యం సేకరణ కనీసం 4.50 లక్షల టన్నులు కూడా దాటలేదు పరిమితం కానుంది.

 

➡️