అందరి సహకారంతో అభివృద్ధి

అందరి సహకారంతో శ్రీకాకుళం

కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న కార్పొరేషన్‌ అధికారులు

నగరపాలక సంస్థ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

అందరి సహకారంతో శ్రీకాకుళం నగరాన్ని అభివృద్ధి చేస్తానని శ్రీకాకుళం నగర కార్పొరేషన్‌ నూతన కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా అన్నారు. కార్పొరేషన్‌ కమిషనర్‌గా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. చీఫ్‌ ఇంజినీరు పి.సుగుణాకరరావు, మెప్మా పీడీ కిరణ్‌ కుమార్‌, ఉద్యానవన శాఖ ఎడి ప్రసాద్‌, పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ వెంకటరావు తదితరులు ఆమెకు స్వాగతం పలికారు. పలు విభాగాల అధికారులు, సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఘన చరిత్ర కలిగిన ఈ నగరానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నారు. ఇక్కడి ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. నగరంలో మరింత మెరుగైన పారిశుధ్య నిర్వహణ, పార్కింగ్‌ సౌకర్యాలు, ప్రజా మరుగుదొడ్లు, పట్టణ ప్రణాళికా విభాగం, మున్సిపల్‌ పార్కులను మెరుగుపరుస్తామని తెలిపారు. ప్రజలు, ప్రజాసంఘాలు, ఎన్‌జిఒలు, నగరపాలక సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఫతేపూర్‌ జిల్లా చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం శ్రీకాకుళం నగరపాలక సంస్థ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు.

➡️