ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందితుందని

కొత్తూరు : ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి- కొత్తూరు

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందితుందని ఎంపిడిఒ త్రివిక్రమరావు, ఎంఒలు గోవిందరావు, శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.గోవిందరావు అధ్యక్షతన బడికిపోదాం కార్యక్రమంలో విద్యార్థులతో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలన్నారు. విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, దుస్తులు, పుస్తకాలు, నోట్‌బుక్స్‌, బూట్లు తదితర సామగ్రి ప్ర భుత్వం ఉచితంగా అందిస్తుందని అన్నారు. అనం తరం ఎంఇఒలు స్టూడెంట్స్‌ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మెళియాపుట్టి: బడిఈడు పిల్లలు బడిలో ఉండాలని ఎంఇఒ ఎస్‌.దేవేందర్రావు, మల్లారెడ్డి పద్మనాభరావు అన్నారు. మండలంలోని వసుంధరలో బడికిపోదాం కార్యక్రమం నిర్వహించారు. వసుంధర కాలనీ, నడసంద్ర కాలనీ, మెయిన్‌ రోడ్లు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించామని అన్నారు. ప్రయివేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అందుతుందని అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి.లలితకుమారి, ఉపాధ్యాయులు భాస్కరరావు, డి.బాబూరావు పాల్గొన్నారు.

 

➡️