సేవలను కొనసాగిస్తాం

మీసేవ కేంద్రాల్లో సేవలు గతంలో కొనసాగేటట్లే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని

ఆమదాలవలస : వినతిపత్రం అందిస్తున్న మీసేవ నిర్వాహకులు

ఆమదాలవలస :

మీసేవ కేంద్రాల్లో సేవలు గతంలో కొనసాగేటట్లే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో రవికుమార్‌ స్వగృహంలో నియోజకవర్గ మీసేవ కేంద్ర నిర్వాహకులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే మీ సేవ కేంద్రాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీసేవలపై ప్రస్తుత ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకొని మీసేవ కేంద్రాలకు పూర్వ వైభవం తీసుకురావాలని వినతిపత్రం అందించారు. వినతిపత్రం అందించిన వారిలో అన్నెపు రమణమూర్తి, మొదలవలస సురేష్‌, బూర్జ మండల మీసేవ కేంద్రం ఆపరేటర్‌ పప్పల హరినాధరావు, సనపల హరి ప్రతాప్‌, బొడ్డేపల్లి అప్పలనాయుడు, అన్నెపు రమేష్‌ పాల్గొన్నారు.పొందూరు: పొందూరు మండల సచివాలయం ఇంజినీరిం గ్‌ అసిస్టెంట్లు ఎమ్మెల్యే రవికుమార్‌ను ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను వివిధ రకాల ఇంజనీరింగ్‌ విభాగాల్లో రేషనలైజేషన్‌ చేయాలని, వారికి ప్రమోషన్‌ కల్పించడంతో పాటు సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందించారు.

 

➡️