అభివృద్ధి…సంక్షేమ0

అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తూ జిల్లాను ప్రగతిపథంలో నడిపేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రసంగిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

సమ ప్రాధాన్యంతో ముందుకు సాగుతున్నాం

జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా చర్యలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన

అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు

ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, అర్బన్‌

అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తూ జిల్లాను ప్రగతిపథంలో నడిపేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో శుక్రవారం నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పతాకావిష్కరణ చేసి పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు నీటి వనరుల సద్వినియోగానికి అవసరమైన చర్యలు తీసకుంటున్నామని చెప్పారు. సాగునీటి రంగంతో పాటు ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండు విడతల్లో 3.22 లక్షల రైతు కుటుంబాలకు రూ.369.722 కోట్ల వైఎస్సార్‌ రైతు భరోసా-పిఎం కిసాన్‌ పంపిణీ చేశామని తెలిపారు. ఖరీఫ్‌లో రూ.4.01 కోట్ల విలువైన 34,174 క్వింటాళ్ల విత్తనాలను, రబీలో ఇప్పటివరకు 2.14 కోట్ల విలువైన 5,310 క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై అందించామని చెప్పారు. 371 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 79,177 మంది రైతుల నుంచి 3,70,086 మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేసి రూ.618.38 కోట్లు రైతులకు చెల్లించామని చెప్పారు.మత్స్యకారులకు ఆర్థిక భరోసా 2023-24లో మత్స్య కారులకు వేట నిషేధ సమ యంలో మర, సంప్ర దాయ పడవలకు రూ.15.28 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించి ందన్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు తెలిపారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్స్‌ మత్స్యకారులకు రుణ సదుపాయం కల్పించడానికి 215 మందికి రూ.1.1 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు.పరిశ్రమల స్థాపనతో ఉపాధి జిల్లాలో 2023-24లో రూ.289.49 కోట్లతో 3,239 ఎంఎస్‌ఎంలను ఏర్పాటు చేసి 11,847 మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద పోర్టు నిర్మాణం ప్రారంభించామన్నారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం వద్ద సముద్ర తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పథకం కింద 2023-24లో 866 మందికి శిక్షణ ఇవ్వగా, 622 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. తొమ్మిది జాబ్‌మేళాల ద్వారా 1155 మందికి డైరెక్ట్‌ ప్లేస్‌మెంట్స్‌ ఇచ్చామన్నారు.ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి చర్యలుఫ్యామిలీ ఫిజీషియన్‌ కింద ప్రతి ఆరోగ్య కేంద్రానికి ఇద్దరేసి వైద్యాధికారుల చొప్పున కొత్తగా 72 మంది వైద్యాధికారులను జిల్లాలో నియమించామన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్య కళాశాలను అప్‌గ్రేడ్‌ చేసేందుకు, ఆస్పత్రి ఆధునీకరణ పనులకు, 50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాకుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.233.75 మంజూరు చేసిందని, ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. అమ్మఒడి పథకం కింద 1,91,689 మంది తల్లులకు నగదు పంపిణీ చేశామన్నారు. పాఠశాల విద్యను మరింత బలోపేతం చేయడానికి జిల్లాలో 64 ప్రభుత్వ పాఠశాలలను సిబిఎస్‌ఇ పాఠశాలలుగా మార్చి బోధనా ప్రక్రియను కొనసాగిస్తున్నామని చెప్పారు. పలు సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు.జగనన్న కాలనీల్లో మౌలిక వసతులుజగనన్న కాలనీల కింద జిల్లాలో 75,840 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇప్పటివరకు 33,422 ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. రాష్ట్రస్థాయిలో జిల్లా మూడో స్థానంలో నిలించిందన్నారు. శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు డిపిఆర్‌ను ప్రభుత్వానికి పంపించామన్నారు. ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ నూతన భవన నిర్మాణాన్ని ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేందుకు పనులు శరవేగంగా చేపడుతున్నట్లు తెలిపారు.’ఉపాధి’లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంఉపాధి హామీ ద్వారా 2023-24లో 3.30 లక్షల కుటుంబాలకు 172.14 లక్షల పని దినాలు కల్పించి రాష్ట్రస్థాయిలో శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. వంద రోజుల పని కల్పనలో రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో ఉందన్నారు. మిషన్‌ వాత్సల్య స్పాన్సర్‌షిప్‌ ప్రోగ్రాం ద్వారా 651 మంది అనాథలు, వ్యాధిగ్రస్తులైన పిల్లలకు రూ.2.86 కోట్లను బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు తెలిపారు.జల జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ నీళ్లుఉద్దానం తాగునీటి పథకం కింద ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో 807 గ్రామాలకు రూ.700 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం ఇప్పటికే ప్రారంభమైందన్నారు. జల జీవన్‌ మిషన్‌ ద్వారా ఇప్పటివరకు 2,15,034 గృహాలకు తాగునీరు కల్పించామన్నారు. జగనన్న హౌసింగ్‌ కాలనీల్లో తాత్కాలికంగా 791 పనులకు రూ.3804.35 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇప్పటివరకు 555 పనులు పూర్తయ్యాయన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చిన 980 పనులకు రూ.28.98 కోట్లు మంజూరయ్యాని, వాటిలో 360 పూర్తి చేసి మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.254 మందికి ప్రశంసాపత్రాలుఅత్యుత్త సేవలందించిన ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు చెందిన 254 మందికి ప్రశాంసాపత్రాలను అందజేశారు. వీరిలో 85 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 246 మందికి ఇచ్చారు. వీరితో పాటు ఏడు స్వచ్ఛంద సంస్థల నుంచి ఎనిమిది మందికి ప్రశాంసాపత్రాలు అందించారు.స్టాల్స్‌ సందర్శనగణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పలు ప్రభుత్వ శాఖలు ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై స్టాల్స్‌ను ప్రదర్శించాయి. రవాణా, మత్స్య, వ్యవసాయ, పశుసంవర్థక, విద్య, ఐసిడిఎస్‌, విపత్తు స్పందన, అగ్నిమాపక, నీటిపారుదల, ఉద్యాన శాఖ, గిరిజన సహకార సంస్థ, సీతంపేట సేంద్రియ అటవీ వ్యవసాయ ఉత్పత్తులు, డిఆర్‌డిఎ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ను తిలకించారు. అనంతరం పలు ప్రభుత్వ శాఖలు మంజూరు చేసిన రుణాలు, ఆర్థికసాయాన్ని లబ్ధిదారులకు అందించారు. వేడుకల్లో ఎస్‌పి జి.ఆర్‌ రాధిక, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, సీతంపేట ఐటిడిఎ పిఒ కల్పనా కుమారి, సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ఎస్‌ఇబి ఎఎస్‌పి ఎన్‌.వి మణికంఠ, డిఆర్‌డిఒ ఎం.గణపతిరావు, ఆర్‌డిఒ సిహెచ్‌.రంగయ్య, కలెక్టర్‌ సతీమణి సాయాలి లాఠకర్‌, పలు శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.ఆకట్టుకున్న శకటాలుపౌరసరఫరాలు, గృహనిర్మాణ, సమీకత గిరిజనాభివద్ధి సంస్థ, వైద్యారోగ్య, 104, 108, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి సంస్థ, విద్య, జలవనరులు, జలజీవన్‌ మిషన్‌, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, విపత్తులు అగ్నిమాపక తదితర శాఖలు ఆయా విభాగాల ప్రగతిని తెలియజేస్తూ శకటాల ప్రదర్శన అందరినీ ఆకర్షించాయి. శకటాల ప్రదర్శనలో ఐసిడిఎస్‌ శకటానికి మొదటి స్థానం, డిఆర్‌డిఎ శకటానికి ద్వితీయ స్థానం, డ్వామా శకటం తతీయ స్థానం కైవసం చేసుకున్నాయి.అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలుపలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. దేశభక్తిని మేళవిస్తూ సాగిన నృత్యాలు ఉత్తేజం నింపాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థుల్లో శ్రీకాకుళం న్యూ సెంట్రల్‌ స్కూల్‌ విద్యార్థులు మొదటి బహుమతి, గిరిజన సంక్షేమ శాఖ పోస్ట్‌మెట్రిక్‌ హాస్టల్‌ విద్యార్థుల నృత్య ప్రదర్శనకు ద్వితీయ బహుమతి, పోలాకి కెజిబివి విద్యార్థులకు తృతీయ బహుమతి లభించింది. విద్యార్థులకు కలెక్టర్‌ ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందించారు.

 

➡️