ఆటలతో మానసికోల్లాసం అదనపు

ఉద్యోగస్తులకు ఆటలతోనే

ట్రోఫీని అందజేస్తున్న ఎఎస్‌పి తిప్పేస్వామి

  • ఎస్‌పి జె.తిప్పేస్వామి

ప్రజాశక్తి- ఎచ్చెర్ల

ఉద్యోగస్తులకు ఆటలతోనే ఒత్తిడి పోయి మానసికోల్లాసం కలుగుతుందని జిల్లా అదనపు ఎస్‌పి జె.తిప్పేస్వామి పేర్కొన్నారు. జిల్లా పోలీస్‌ శాఖ రెవెన్యూ శాఖ సమన్వయం ఏర్పడాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, ఎస్‌పి జి.ఆర్‌.రాధిక ఆదేశాల మేరకు ఆదివారం ఎచ్చెర్ల మండలంలోని శివాని ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో పోలీస్‌, రెవెన్యూ జట్టుల మధ్య స్నేహపూర్వకమైన క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. ఈ స్నేహం పూర్వకమైన క్రికెట్‌ మ్యాచ్‌కు తిప్పేస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పోలీస్‌ జట్టు నిర్మిత 20 ఓవర్లు 204 పరుగులు చేసింది. అనంతరం రెవెన్యూ జట్టు 177 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. రెవెన్యూ జట్టు తరపున సహాయ కలెక్టర్‌ రాఘవేంద్రమీనా కెప్టెన్‌గా, పోలీస్‌ జట్టు తరపున ట్రైన్‌ డిఎస్‌పి సిహెచ్‌.రాజా కెప్టెన్‌గా వ్యవహరించారు. అనంతరం విజేతలకు ట్రోఫీని ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ అనేక ఒత్తిడులు ఎదుర్కొని రెవెన్యూ, పోలీస్‌ శాఖ ఉద్యోస్తులు విధులు నిర్వహిస్తారని, అలాంటి ఒత్తిడికి ఉపశమనం కేవలం క్రీడలేనని అన్నారు. ఉద్యోగస్తులు రోజూ కొత సమయాన్ని క్రీడలకు, ఆటలకు కేటాయించాలని అన్నారు. మంచి పౌష్టికాహారమైన ఆహారాన్ని తీసుకుంటూ రోజూ వ్యాయం చేసుకోవాలని సూచించారు. ఇలాంటి ఆటల వల్ల ఉద్యోగస్తులలో సమన్వయం ఏర్పడి అందరూ సమిష్టిగా పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో శివాని ఇంజినీరింగ్‌ కళాశాల మేనేజ్‌మెంట్‌ పి.దుర్గాప్రసాద్‌ రాజు, ప్రిన్సిపాల్‌ వై.శ్రీనివాసరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ జి.టి.చంద్రశేఖర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ టి.బాలాజీ, ఆర్‌ఐలు సురేష్‌, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

 

 

➡️