ఆపద సమయంలో ఆ నలుగురుసామాజిక సేవలో స్వచ్ఛంద సంస్థలు

ఎక్కడో పుట్టి... ఎక్కడో పెరిగిన వారిని కొన్ని అనుకొని సంఘటనలు అనునిత్యం కలిసేలా చేస్తున్నాయి. సొంత లాభం కొంతమానుకుని

– కాళీ సాహు, హెల్పింగ్‌ హాండ్స్‌ హేండ్స్‌ సభ్యుడురక్తదానం చేస్తున్న యువకులు (ఫైల్‌)

ప్రజాశక్తి- కవిటి

ఎక్కడో పుట్టి… ఎక్కడో పెరిగిన వారిని కొన్ని అనుకొని సంఘటనలు అనునిత్యం కలిసేలా చేస్తున్నాయి. సొంత లాభం కొంతమానుకుని పొరుగువానికి సాయపడవోరు… దేశమంటే మట్టికాదోరు దేశమంటే మనుషులోరు… అన్న గురజాడ కవితను అవుపోసన పట్టిన ఆ నలుగురు ఏకమవుతున్నారు. ఆపద సమయంలో తాము అనుభవించిన వేదన, తమ కుటుంబ నేపథ్యం, సామాజిక పరిస్థితులు చూసి చలించిపోయి తమలా మరొకరు బాధపడకూడదనే దృఢ సంకల్పంతో చేయిచేయి కలుపుతున్నారు. ప్రతీ గ్రామంలోనూ స్వచ్ఛంద సంస్థలుగా ఏర్పడుతున్నారు. ఆపద అంటే సరే పద అంటూ ఆర్తులకు అండగా నిలుస్తున్నారు. కష్టం వచ్చిందని తెలిస్తే కన్నీరు కారుస్తూ కూర్చోకుండా చేయిచేయి కలిపి ఆ కష్టానికే కన్నీరు తెప్పిస్తున్నారు.కీలకపాత్ర పోషిస్తున్న స్వచ్ఛంద సంస్థలుఇటీవల కాలంలో ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా, ఎవరు ఆపదలో ఉన్నారని తెలిసినా వారికి అండగా నిలిచేందుకు స్వచ్ఛంద సంస్థలు సిద్ధంగా ఉంటున్నాయి. ప్రతి గ్రామంలోనూ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఉంటూ తమ పరిధిలో ఉన్న సమాచారం సంస్థకు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా హెల్పింగ్‌ హేండ్స్‌, మాతృమూర్తి యువజన సంఘం, డాక్టర్‌ అబ్దుల్‌ కలామ్‌ ఫౌండేషన్‌, ఎస్‌జిఎఫ్‌, అన్నవరం హెల్పింగ్‌ హేండ్స్‌, జైహింద్‌ ఫౌండేషన్‌, రక్షణ ఫౌండేషన్‌, పవన పుత్ర సేవా సమితి, ఉద్దానం ఫౌండేషన్‌, సిక్కోలు ఉద్దానం సేవా సమితి, ఆ నలుగురు, మృత్యుంజయ ఫౌండేషన్‌, సీతయ్య ఫౌండేషన్‌ తదితర స్వచ్ఛంద సంస్థలు వివిరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆర్తులు, అభాగ్యులకు అండగా నిలుస్తున్నాయి. ఎంతలా అంటే లక్షలాది రూపాయలు ఆర్తులకు అందిస్తూ అమ్మలా ఆదరిస్తున్నాయి.రక్తదానంపై తొలగిన అపోహలుగతంలో ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉండి రక్తం అవసరమైనప్పుడు రక్తదాత పక్కనే ఉన్నా రక్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చేవారు కాదు. తాము రక్తం ఇస్తే తాము అనారోగ్యానికి గురవుతామని, రక్త దానం అనేది మంచి పద్ధతి కాదనే అపోహ అప్పట్లో వారిలో బలంగా నాటుకుపోయింది. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారింది. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక స్పృహ మెండుగా ఉన్న యువతరం విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఏ ఆస్పత్రిలో రక్తం కోసం రోగులు ఎదురుచూస్తున్నారని తెలిసినా వెంటనే అక్కడికి వెళ్లి రక్తదానం చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో రక్తదానంపై ఉన్న అపోహలు తొలగించి, రక్తదానం చేయాలని యువతని ప్రోత్సహిస్తున్నారు. చిన్ని గుండెకు… పెద్ద స్పందనమండలంలో ఎల్‌హెచ్‌ఎల్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న 9 నెలల చిన్నారి ఆద్య దయనీయ పరిస్థితి వివరిస్తూ ఆగస్టు 15న ప్రజాశక్తి ‘చిన్ని గుండెకు పెద్ద కష్టం’ అంటూ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి అటు స్వచ్ఛంద సంస్థలు, ఇటు యువతరం నుంచి అనూహ్య స్పందన లభించింది. ఎంతలా అంటే కేవలం పది రోజుల్లోనే పాప వైద్యానికి అవసరమైన 18 లక్షలు దాతలు అందించారు. ఇందులో స్వచ్ఛంద సంస్థలు, నేటి యువతరం పాత్ర నభూతో నభవిష్యత్‌ అనేలా సాగింది.కొన్ని కన్నీటి గాథల నుంచి పుట్టిన ఆలోచన2013లో నేను పదో తరగతి చదివినప్పుడు వలస కూలీగా ఉన్న మా గ్రామానికి చెందిన వ్యక్తి అండమానులో కొబ్బరి చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అవడంతో మా స్నేహితులమంతా కలిసి రూ.25 వేలు అందించాం. అదే మేము ఒక సంస్థగా ఏర్పడితే ఇలాంటి ఎంతో మందికి అండగా నిలవచ్చనే ఆలోచన ఏర్పడింది. ఇప్పుడు 220 మంది సభ్యులుగా ఉన్నారు. ఇప్పటివరకు రూ.ఆరు లక్షల వరకు దాతలకు సాయం రూపంలో అందించగా, సుమారు 500 యూనిట్ల రక్తదానం చేశారు.

 

➡️