ఇళ్ల నిర్మాణాలు వేగవంతం

గృహ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ అధికారి గణపతిరావు

ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్న పీడీ గణపతిరావు

ప్రజాశక్తి- బూర్జ

గృహ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ అధికారి గణపతిరావు సూచించారు. గురువారం పెదలంకాం, వావాం గ్రామాల్లో గహ నిర్మాణాల లేఅవుట్లను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారితో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మాణాల కోసం లబ్ధిదారులకు ఎన్నో అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఈ అవకాశాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. లబ్ధిదారులకు గృహ నిర్మాణాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం హౌసింగ్‌ కార్యాలయంలో సిబ్బందితో మాట్లాడారు. గహాలు మంజూరైనప్పటికీ ఇంతవరకు పనులు చేపట్టని వారి వివరాలను నమోదు చేసినట్లయితే వారి స్థానంలో వేరొకరికి అవకాశం కల్పించాలన్నారు. అలాగే లబ్ధిదారులకు మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కల్పించాలన్నారు. ఆయనతో పాటు ఎఇ కె.లక్ష్మీనారాయణ, వర్క్‌ ఇన్స్‌పెక్టర్లు ఎం.రాంప్రసాద్‌, ఎస్‌. మదన్‌ మోహనరావు, పురుషోత్తమరావు, హౌసింగ్‌ సిబ్బంది ఉన్నారు.

 

➡️