ఉత్సాహంగా ‘ఆడుదాం ఆంధ్రా’

ఆడుదాం ఆంధ్రా మండల స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కవిటి, శిలగాం, బొరివంక వేదికల్లో

జి.సిగడాం : విజేతలతో ఎంపిడిఒ నిశ్చల

కవిటి: ఆడుదాం ఆంధ్రా మండల స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కవిటి, శిలగాం, బొరివంక వేదికల్లో బుధవారం జరిగిన క్రికెట్‌, ఖోఖో పోటీల్లో పలు జట్లు విజయం సాధించాయి. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి కడియాల ప్రకాష్‌, సర్పంచుల సంఘం అధ్యక్షుడు పూడి లక్ష్మణరావు, పూడి నీలాచలం, పాండవ చంద్రశేఖర్‌, ఎన్ని అశోక్‌, ఇఓఆర్డి శివాజీ పాణిగ్రాహి, ఎఒ శ్రీనివాస రెడ్డి, ఇఒ వీరభద్రస్వామి, కార్యదర్శి మన్మథరావు, విఆర్‌ఒ నారాయణ పాల్గొన్నారు. పోలాకి: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు క్రీడాకారులుగా ప్రోత్సాహించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మండల ప్రత్యేక సలహారులు ముద్దాడ భైరాగినాయుడు అన్నారు. మండలంలోని కోడూరు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ కణితి కృష్ణారావు, యువజన విభాగం అధ్యక్షుడు ఆర్‌.త్రినాథరావు, చింతాడ ఉమా, ఎస్‌సిసెల్‌ అధ్యక్షులు కె.లక్ష్మణరావు పాల్గొన్నారు.జి.సిగడాం: ఆడుదాం ఆంధ్రా పోటీలు మండలంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. యువత ఈ పోటీల్లో పెద్దఎత్తున పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఎంపిడిఒ కె.నిశ్చల అన్నారు. ఇప్పటికే గ్రామస్థాయి పోటీలు ముగియగా, బుధవారం నుంచి మండల స్థాయి క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. సచివాలయ స్థాయిలో గెలుపొందిన జట్లు మండలస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. రెండవ రోజు కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించారు. మండలస్థాయి పోటీల్లో విజేతలు, నియోజకవర్గ స్థాయి పోటీల్లో తలపడతారని తెలిపారు. ఆనందపురం నుంచి కబడ్డి, వాలీబాల్‌ మండలస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఎంపిడిఒ, మండల స్థాయి అధికారులు ఈ పోటీలను పర్యy ేక్షించారు. కార్యక్రమంలో కార్యదర్శులు కూనిబిల్లి కోటేశ్వరావు, ఎస్‌.రాజా రమేష్‌, పొట్నూరు సురేష్‌, కిమిడి హైమావతి, హిమ బిందు, పైల జైరాం, చేబ్రోలు సురేష్‌, పప్పల శ్రీనివాసరావు, రౌతు చైతన్య కుమారి, పిఇటిలు పాల్గొన్నారు. పోలీసుల పర్యవేక్షణలో క్రీడా పోటీలుటెక్కలి : ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల వేదిక గురువారం మారింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలోనే ఆన్ని క్రీడలు నిర్వహించడం కష్టతరంగా ఉండడంతో కొన్ని క్రీడలు జూనియర్‌ కళాశాల మైదానానికి తరలించారు. ఆయితే బుధవారం జరిగిన క్రీడల్లో క్రీడాకారులు కోట్లాడుకోవడంతో గురువారం పోలీసుల పర్యవేక్షణలో పోటీలు నిర్వహించారు. ఈ మేరకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ వంటి క్రీడా పోటీలు నిర్వహించారు. ఎప్పటికప్పుడు పోలీసులు క్రీడా మైదానాన్ని సందర్శిస్తూ… పర్యవేక్షించడంతో సజావుగా సాగాయి. చాకిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు బాడాన నారాయణరావు, కె.కె.రామిరెడ్డి, రాజా, యరపత్ని వెంకటరమణ, కాపల రఘునాథరావు నిర్వహించారు.

 

➡️