ఉపాధి కల్పనా కేంద్రంలో ఆన్‌లైన్‌ నమోదు

ఉన్నత విద్యా వంతులైనా.. కనీస చదువు మాత్రమే ఉన్న వారైనా తమ వివరాలను నేరుగా ఎంప్లాయీమెంట్‌ ఎక్స్ఛేంజ్‌కి వెళ్లకుండా

కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం అమలు

నేషనల్‌ కెరీర్‌ పోర్టల్‌కు అనుసంధానం

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఉన్నత విద్యా వంతులైనా.. కనీస చదువు మాత్రమే ఉన్న వారైనా తమ వివరాలను నేరుగా ఎంప్లాయీమెంట్‌ ఎక్స్ఛేంజ్‌కి వెళ్లకుండా ఇకపై ఆన్‌లైన్‌లో నమోదుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. విద్యార్హలతో కూడిన ధ్రువపత్రాలను ఎంప్లాయిమెంట్‌కు ఎక్స్ఛేంజ్‌కి వెళ్లకుండా నమోదుకు అవకాశం కల్పిస్తూ కొత్త పోర్టల్‌ను తీసుకొచ్చింది. అన్ని విద్యార్హతలకూ మూడేళ్ల వరకు మనుగడలో ఉంటుంది. ఉన్నత విద్యా వంతులైనా.. కనీస చదువు మాత్రమే ఉన్న వారైనా తమ వివరాలను నేరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకువీలు కల్పించింది. నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ (ఎన్‌సిఎస్‌) పోర్టర్‌ ద్వారా ఎంప్లాయిమెంట్‌ కార్యాలయాల వివరాలను ఈ పోర్టర్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థి తమ విద్యార్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వెంటనే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజీలను ఈ పోర్టర్‌తో అనుసంధానం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు నేరుగా అభ్యర్థి ఫోన్‌లోకి పూర్తి సమాచారంతో అందిస్తారు. ప్రభుత్వ, కార్పొరేట్‌, ప్రయివేటు సంస్థల నోటిఫికేషన్లు అభ్యర్థులకు మౌఖిక పరీక్షల వివరాల సమాచారం ఇందులో పొందుపరుస్తారు. మొదలైన నమోదు ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువత, విద్యార్థులు, వ్యక్తిగత, విద్యా వివరాలను ఇక నుంచి ఇంటి వద్ద నుంచి ష్ట్ర్‌్‌జూ://వఎజూశ్రీశీyఎవఅ్‌.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌ పరిధిలో నమోదు చేసుకున్న వారూ ఈ పోర్టర్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో ఈ నమోదు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. పునరుద్ధరణ, మార్పులు, చేర్పులతో పాటు కొత్తగా నమోదు చేసుకునేందుకు వీలు కల్పించారు. కొత్తగా నమోదు చేసుకోవాల్సిన వారు తమ విద్యార్హత, ఫొటో, సంతకాన్ని స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేస్తే వివరాల నమోదుకు అభ్యర్థి ఫోన్‌కు తాత్కాలిక యూజర్‌ ఐడీ వస్తుంది. వివరాలు నమోదు చేసిన తర్వాత సబ్మిట్‌పై క్లిక్‌ చేస్తే అభ్యర్థి ఎంచుకున్న జిల్లా ఎంప్లాయిమెంట్‌ కార్యాలయానికి వివరాలు అనుసంధానమవుతాయి. వాటిని సిబ్బంది పరిశీలించి ఆన్‌లైన్‌లో జిల్లా ఉపాధి కల్పనాధికారి ఆమోదం తెలిపిన వెంటనే అభ్యర్థికి తిరిగి మెసేజ్‌ వస్తుంది. అభ్యర్థి వివరాలు ఈ పోర్టర్లలో మూడేళ్ల వరకు ఉంటాయి. అనంతరం మరో ఆరు నెలల గ్రేస్‌ పీరియడ్లోపు పునరుద్ధరించుకోవాలి. 2019 నుంచి ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లాల్లో పది, ఇంటర్‌, డిగ్రీ, ఐటిఐ, పీజీ, డిప్లమో, ఎంబిఎ, ఎంసిఎ విభాగాల్లో జిల్లా ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో 18740 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు.అందుబాటులో ఆన్‌లైన్‌ఈ వెబ్‌సైట్‌లో అన్ని తరగతుల అభ్యర్థులు వివరాలను నమోదు చేసుకోవచ్చు. 1994 నుంచి ఆప్‌లైన్‌లో వివరాలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు ఎక్కడ నుంచైనా నమోదు చేసుకునేందుకు వీలు కలిగింది. పీజీ, ఇతర వృత్తిపరమైన కోర్సుల పూర్తి చేసిన వారూ నమోదు చేసుకోవచ్చు. ఆయా వివరాలను పరిశీలించి ఆమోదం ఇవ్వ నున్నాం. ఇంతవరకు ఆప్‌లైన్‌లో ఉపాధి కల్పనశాఖలో సుమారు 40 వేల మంది అభ్యర్థుల వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త విధానంపై యువతకు పూర్తిస్థాయి అవగాహన కల్పించనున్నాం. – కొత్తలంక సుధ, జిల్లా ఉపాధి కల్పనాధికారి

➡️