ఎన్నాళ్లు ఈ నరకయాతన.?

దశాబ్దాల కాలంగా పక్కా రహదారికి నోచుకోక అనునిత్యం నడకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రోడ్డుకష్టాలు తీరుతాయని ఎదురుచూస్తున్న గిరిజనులకు నిరాశే ఎదురైంది. మండలంలో వైకుంఠపురం పంచాయతీ పరిధిలో అల్లిపల్లి గూడ గిరిజన గ్రామం

ఆటోను తోస్తున్న స్థానికులు

గర్భిణులకు తప్పని అవస్థలు

ప్రజాశక్తి- బూర్జ

దశాబ్దాల కాలంగా పక్కా రహదారికి నోచుకోక అనునిత్యం నడకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రోడ్డుకష్టాలు తీరుతాయని ఎదురుచూస్తున్న గిరిజనులకు నిరాశే ఎదురైంది. మండలంలో వైకుంఠపురం పంచాయతీ పరిధిలో అల్లిపల్లి గూడ గిరిజన గ్రామం కనీస మౌలిక సదు పాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత మూడు రోజులుగా తుపాను కారణంగా అల్లిపల్లిగూడ రహదారి దమ్ములమడిగా మారింది. గురువారం భారతి అనే గర్భిణీని పట్టణానికి స్కానింగ్‌ కోసం తీసుకు వెళ్తుండగా ద్విచక్ర వాహనం బోల్తా పడటంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గతంలో ఇదే రహదారిపై పాఠశాల విద్యార్థులు తీసుకువెళ్తున్న ఆటో బురదలో ఇరుక్కు పోవడంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొ న్నారు. ప్రస్తుతం గ్రామం నుంచి బయట ప్రపంచానికి రావాలంటే ఉన్న ఒక్క రహదారి అధ్వానంగా మారడంతో అత్యవసర సమయంలో కూడా తాము బయటికి రాలేని పరిస్థితి దాపురించిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఐటిడిఎ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, ఐటిడిఎ పిఒ స్పందించి గ్రామానికి రహదారిని బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదివాసి నాయకుడు శోభన్‌ కోరారు.

 

➡️