ఎన్నికల్లో సెక్టార్‌ అధికారులదే కీలకపాత్ర కలెక్టర్‌

సార్వత్రిక ఎన్నికల

మాట్లాడుతున్న కలెక్టర్‌ నమజీర్‌ జిలానీ సమూన్‌

  • మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సెక్టార్‌ అధికారుల, పోలీసుల పాత్ర కీలకమైందని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సెక్టార్‌ అధికారులకు, పోలీస్‌ అధికారులకు ఎన్నికల ప్రక్రియపై మంగళవారం శిక్షణ, అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియపై ప్రతిఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల విధుల్లో చేపట్టాల్సిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అలాగే ఎన్నికల్లో తాము చేయకూడని పనులపైనా అవగాహన కలిగి ఉండలన్నారు. చెక్‌ లిస్ట్‌, హ్యాండ్‌ బుక్‌లను క్షుణ్ణంగా చదవాలని కోరారు. రిటర్నింగ్‌ అధికారులు, సెక్టార్‌ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్‌ స్టేషన్‌నూ సందర్శించాలన్నారు. వారి పరిధిలోని పోలింగ్‌ స్టేషన్ల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు, పోలింగ్‌ సిబ్బందికి వసతుల విషయమై లోటుపాట్లు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని, ఎట్టి పరిస్థితు ల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించా రు. శిక్షణ పొందిన రోజు నుంచి పోలింగ్‌ పూర్తయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాస్టర్‌ శిక్షకులు, నోడల్‌ అధికారులుగా ఎం.కిరణ్‌కుమార్‌, కే.శేషగిరిరావు ఎన్‌.బాలాజీలు వ్యవహరించారు. ఎన్నికల ప్రక్రియపై, పోలింగ్‌కు ముందు, పోలింగ్‌ సందర్భంలో, పోలింగ్‌ తర్వాత చేయాల్సిన విధుల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సెక్టార్‌ అధికారులు, సెక్టార్‌ పోలీస్‌ అధికారులకు అవగాహన కల్పించారు. అదనపు ఎస్‌పి ప్రేమకాజల్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, డిఎస్‌పి విజరు కుమార్‌, 30 మండలాల నుంచి సెక్టార్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️