కరాటేలో బాలికల సత్తా

షోత్తపురం పాఠశాల విద్యార్థులు కరాటిలో సత్తా చాటారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో విశాఖలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పురుషోత్తపురం పురపాలక

విద్యార్థులను అభినందిస్తున్న అధ్యాపకులు

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

పురుషోత్తపురం పాఠశాల విద్యార్థులు కరాటిలో సత్తా చాటారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో విశాఖలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పురుషోత్తపురం పురపాలక ఉన్నత పాఠశాలకు చెందిన టి.సాయి ప్రియ, డి.పూజ ప్రతిభ చాటి స్వర్ణ పథకాలు కైవసం చేసుకున్నారు. సాయి ప్రియ 43 కేజీలు, 14 సంవత్సరాల విభాగంలో కాటా నైపుణ్యంలో రజితం సాధించగా కుమిటి (ఫైట్‌)కి కాంస్యం సాధించారు. పూజ 13 సంవత్సరాలు, 25 కేజీల విభాగంలో కోటలో కాంస్యం సాధించగా, కుమిటిలో స్వర్ణం సాధించారు. పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వై.లతతో పాటు పాఠశాల సిబ్బంది దుశ్శాలువతో సత్కరించారు. కోచ్‌ ప్రకాష్‌, ఉపాధ్యాయులు రాజగోపాల్‌, రాంప్రసాద్‌, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

 

➡️