కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి

శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కళ్లు

మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కళ్లు ఒకటని, కళ్లను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కాపాడుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జునైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు. జిల్లా బార్‌ అసోసియేషన్‌ నూతన భవనంలో ఐ ఎక్స్‌ ప్రెస్‌ సంస్థ ఆధ్వర్యాన న్యాయవాదులకు బుధవారం ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు. ముందుగా ఈ శిబిరాన్ని జడ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వేంద్రియానాం నయనం ప్రదానమని ఆయన గుర్తు చేశారు. నేటి ఆధునిక యుగంలో టివిలు, స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా వాడడం వల్ల కంటి శుక్లాలు దెబ్బ తింటున్నాయన్నారు. చిన్నారులను సాధ్యమైనంతవరకు స్మార్ట్‌ఫోన్లకు దూరంగా ఉంచాలని చెప్పారు. నేత్ర సమస్యలు వచ్చిన వెంటనే సొంత వైద్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. న్యాయవాదులకు దినేష్‌ నేత్రాస్పత్రి డాక్టర్‌ దినేష్‌ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఆపధర్మ అధ్యక్షులు, న్యాయశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ ఎన్ని సూర్యారావు, న్యాయవాదులు కద్దాల శ్యాంసుందరరావు, గొంటి చంద్ర మౌళి, చౌదరి లక్ష్మణరావు, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్‌, పాడి సీతంనాయుడు, అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు బెజ్జిపురపు ఫాల్గుణరావు, జల్లు తిరుపతిరావు, పాలిశెట్టి మల్లిబాబు, వినియోగదారుల హక్కుల సంఘం జిల్లా సెక్రెటరీ నిహార్‌నాయుడు, ఐ ఎక్స్ప్రెస్‌ సంస్థ మేనేజర్లు మజ్జి సుమన్‌, లక్ష్మణరావు, మజ్జి స్వాతి, సాయికుమార్‌, వెంకటేష్‌, జయరాం పాల్గొన్నారు.

 

➡️